సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింకలు

కృష్ణజింకల కేసులో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ భవితవ్యం త్వరలో తేలబోతోంది. ఇప్పటికే బెయిల్‌ మీద ఉన్న సల్మాన్‌- మళ్లీ కోర్టులో హాజరు కావాలి. 22 ఏళ్లనాటి కృష్ణజింకల వేట- ఈ కండలవీరుడిని వెంటాడుతోంది. మూగజీవాల్ని వేటాడిన కేసులో ఇప్పటికి పలుమార్లు జైలుశిక్షను అనుభవించిన సల్మాన్‌ విషయంలో న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

సల్మాన్‌ఖాన్‌ను వెంటాడుతున్న కృష్ణజింకలు
Follow us

|

Updated on: Sep 15, 2020 | 10:53 PM

Blackbuck Poaching Case  : బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ను కృష్ణజింకల వేట కేసు వదలడం లేదు. కృష్ణ జింకల కేసు, ఆయుధాల చట్టం ప్రకారం పెట్టిన కేసులో ఈనెల 28న వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాజస్థాన్లోని జోధ్‌పూర్‌ కోర్టు ఆదేశించింది. ఆ కేసులో ఇంకా విచారణ ముగియలేదు. అందుకే కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీఅయ్యాయి.

“హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్‌ సందర్భంగా 1998 అక్టోబర్‌లో- సల్మాన్‌, సైఫ్‌ అలీఖాన్‌, నీలమ్‌, టబు, సోనాలిబింద్రే కృష్ణజింకలను, చింకారాలను వేటాడారు. ఈ కేసులో వీళ్లందరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో సల్మాన్ మినహా అందరికీ విముక్తి లభించింది.

ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌కు 2018 ఏప్రిల్‌ 5న ఐదేళ్ల జైలుశిక్ష పడింది. రెండురోజులు జైల్లో గడిపిన తర్వాత 2018 ఏప్రిల్‌ 7న ఆయన బెయిల్‌ వచ్చింది. కానీ ఈ కేసులో విచారణ మాత్రం ముగియలేదు. సెప్టెంబర్‌ 28న సల్మాన్‌ఖాన్‌ కోర్టు ముందుకు వ్యక్తిగతంగా రావల్సి ఉంది.

ఈ కేసులో ఏం జరగబోతోంది? సల్మాన్‌ఖాన్‌కు అనుకూలంగా తీర్పు వస్తుందా? లేక మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయా అన్నది కీలకంగా మారింది.