కేజీ మటన్ రూ. 200/..ఆధార్ ఉంటేనే అమ్మకాలు..!

కృష్ణా జిల్లా జి.కొండూరులోని ఓ మాంసం దుకాణం వద్ద జనాలు భారీ క్యూ కట్టారు. కేజీ వేట మాంసం రూ.200 లు మాత్రమే అని బోర్డు చూసి మాంసం ప్రియులు, స్థానికులు ఎగబడ్డారు. అయితే, మటన్ కొనాలనుకునేవారు

కేజీ మటన్ రూ. 200/..ఆధార్ ఉంటేనే అమ్మకాలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 8:02 PM

కృష్ణా జిల్లా జి.కొండూరులోని ఓ మాంసం దుకాణం వద్ద జనాలు భారీ క్యూ కట్టారు. కేజీ వేట మాంసం రూ.200 లు మాత్రమే అని బోర్డు చూసి మాంసం ప్రియులు, స్థానికులు ఎగబడ్డారు. అయితే, మటన్ కొనాలనుకునేవారు ఆధార్ తప్పని సరిగా వెంట తీసుకురావాలనే కండిషన్ కూడా పెట్టారు. అయితే, ఒక్కరోజు మాత్రమే ఈ అమ్మకాలు జరిపి మర్నాడు లేదని చెప్పడంతో మటన్ రేటుపై విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి.

జిల్లాలోని జి‌.కొండూరు లోని ఓ మాంసం దుకాణం వద్ద సోమవారం కేజీ వేట మాంసం 200 మాత్రమే అని బోర్డ్ పెట్టి, ఆధార్ కార్డ్ లింక్ పెట్టడంతో తమ కార్డులతో పాటు ప్రక్క ఇళ్ళ ఆధార్ కార్డ్ లు కూడా తీసుకుని జనం క్యూ కట్టారు. తిరిగి మంగళవారం మాత్రం మామూలు ధరకే మాంసం అమ్మకాలు జరపటంతో గ్రామస్తులు ఆగ్రహించారు. కొంతమంది ఇవి చచ్చిన గొర్రెలంటూ మండిపడ్డారు. మరి కొంతమంది నిన్నెందుకు అమ్మారు? ఇవాళ ఎందుకు లేదంటున్నారు అంటూ షాపు వద్ద వాగ్వాదానికి దిగారు. నిన్న కేజీ మటన్ 200బోర్డ్ పెట్టి ఈ రొజు 600 రేటు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ షాపులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. చచ్చిన, పుచ్చిన జీవాల్ని తీసుకొచ్చి తమ వ్యాపారాభివృద్ధి కోసం ఇలా వ్యాపారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి కేజీ మటన్ 200 అమ్మడంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.

అయితే, జి.కొండూరు వేట మాంసం అమ్మకాల్లో నాణ్యత ఉంటుందనే పేరు పడడంతో ఇక్కడ షాపుల మద్య పోటీ పెరిగింది. ఈ పోటీతోనే మాంసం ధరలు తగ్గించి అమ్మారని, కాకపోతే కధ అడ్డం తిరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఎట్టకేలకు విషయం తెలిసి పోలీసులు రంగప్రవేశం చేశారు.