Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Salary account: శాలరీ అకౌంట్‌‌తో ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?

Salary account, Salary account: శాలరీ అకౌంట్‌‌తో ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?

Salary account: ఈ రోజుల్లో సంస్థ యజమాని, ఉద్యోగి సొంతంగా కార్పొరేట్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం మాములే. బ్యాంకులు రుణాల దగ్గరి నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ సేవలు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. శాలరీ అకౌంట్ అనేది కూడా ఒకరకమైన బ్యాంక్ అకౌంట్. ఉద్యోగి తీసుకునే జీతం ఈ అకౌంట్‌లో క్రెడిట్ అవుతూ వస్తుంది. బ్యాంకులు కేవలం కంపెనీల రిక్వెస్ట్ మేరకే శాలరీ అకౌంట్‌‌ను ఓపెన్ చేస్తాయి. ఉద్యోగి వేతనం ఈ శాలరీ అకౌంట్ ద్వారానే వారికి చేరుతుంది.

ఇవి జీతాల చెల్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీరు అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి చార్జీలు పడవు. బ్యాంకులు శాలరీ అకౌంట్‌పైన డెబిట్ కార్డును అందజేస్తాయి. అలాగే ఉద్యోగులు శాలరీ అకౌంట్‌పై సులభంగానే క్రెడిట్ కార్డు కూడా పొందొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు పొందేందుకు వీలుగా బ్యాంక్ సదురు ఉద్యోగికి నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. దీంతో ఆన్‌లైన్‌లోనే నగదు లావాదేవీలు నిర్వహించొచ్చు.

బ్యాంకులు శాలరీ అకౌంట్ కలిగిన వారికి వివిధ సేవలను అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ కలిగిన వారు ఇతర కస్టమర్లతో పోలిస్తే బ్యాంక్ నుంచి సులభంగానే రుణాలు పొందొచ్చు. వడ్డీ రేటులో రాయితీ వంటి ప్రయోజనం లభిస్తుంది. అలాగే ప్రిఅప్రూవ్డ్ రుణాలు కూడా పొందొచ్చు. శాలరీ అకౌంట్‌పై ఇన్సూరెన్స్ సేవలు కూడా పొందొచ్చు. మీ శాలరీ అకౌంట్ ప్రాతిపదికన యాక్సిడెంట్ డెత్, ఎయిర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి లభిస్తాయి. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుపై కూడా మోసపూరిత లావాదేవీలు జరిగితే వారికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.

కాగా.. కొన్ని బ్యాంకులు వారి కస్టమర్లకు శాలరీ అకౌంట్‌పై డీమ్యాట్ అకౌంట్ సేవలు కూడా అందిస్తున్నాయి. డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. శాలరీ అకౌంట్ ఉన్న వారికి, ఇతర సేవింగ్స్ ఖాతా ఉన్న కస్టమర్లకు క్యాష్ విత్‌‌డ్రా సేవల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. శాలరీ అకౌంట్ కలిగిన వారికి విత్‌డ్రా లిమిట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Related Tags