ఏపీ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీలో విధులు నిర్వహిస్తోన్న 7,600 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని

ఏపీ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!
Follow us

| Edited By:

Updated on: May 22, 2020 | 6:38 PM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆర్టీసీ ఎండీ గుడ్‌న్యూస్ చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీలో విధులు నిర్వహిస్తోన్న 7,600 ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలకుగానూ ఉద్యోగులకు 90 శాతం జీతాలను చెల్లించాలని ఆయన డిపోల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ వ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. దీంతో రాబటి లేకపోవడంతో ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను యాజమాన్యం చెల్లించలేదు. ఇక ఇటీవల ఆర్టీసీ సేవలు పునః ప్రారంభం కావడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విన్నపం మేరకు జీతాలు చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు ప్రతాప్ తెలిపారు. కాగా ఆర్టీసీలో ఔట్‌ సోర్సింగ్ సిబ్బంది విధులకు హాజరు కావొద్దంటూ డిపో మేనేజర్లు ఆ మధ్యన ఉత్తర్వులు జారీ చేశారు. దానికి తోడు వారికి ఏప్రిల్ జీతాలు కూడా చెల్లించలేదు. దీంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించారని కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. దీనిపై స్పందించిన మంత్రి పేర్ని నాని .. ఎవరినీ ఉద్యోగాల నుంచి తీసేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా రక్షణ ఇన్సూరెన్స్ లేకపోవడంతోనే పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా హాజరుకావాలని ఆదేశించామని చెప్పారు.

Read This Story Also: అక్కడ యువత ప్రాణాలే ఎక్కువగా తీసుకుంటోన్న ‘కరోనా’..!

సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం