Sajjala satires బాబూ నువ్విక మారవా? సజ్జల షాకింగ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరు భయాందోళనలో వుంటే చంద్రబాబు...

Sajjala satires బాబూ నువ్విక మారవా? సజ్జల షాకింగ్ కామెంట్స్
Follow us

|

Updated on: Apr 03, 2020 | 3:31 PM

Govt advisor satires on Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విపక్ష నేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరు భయాందోళనలో వుంటే చంద్రబాబు, ఆయన వందిమాగధులు మాత్రం రెగ్యులర్ విమర్శలకు, ఆరోపణలకే పరిమితమవుతున్నారని సజ్జల ఆరోపించారు.

‘‘కరోనా వల్ల ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక లావాదేవీలన్ని నిలిచిపోయాయి. కోవిడ్ భారం వలన ప్రభుత్వ ఖాజానా ఖాళీ అవుతోంది..’’ ఇవి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం చేసిన కామెంట్స్. పరిస్థితి ఇలా వుంటే చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి… రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీకి దూరమని, టీడీపీ నాయకులు రాష్ట్ర ఖజానా నిండుగా ఉందన్న భ్రమల్లో వున్నారని, టీడీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి అప్పుల బారం మోపారు..గత ప్రభుత్వ అప్పులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుస్తుంది.. కరోనా కేసులు దాచి పెట్టల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు ’’ అని అన్నారు సజ్జల.

ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని, వచ్చే పది, పదిహేను రోజులు కీలకమైనవని ఆయనంటున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో విపక్షాలు బాధ్యతాయుతంగా వుండాల్సింది పోయి చౌక బారు రాజకీయాలు చేస్తున్నాయని, మరీ ముఖ్యంగా చంద్రబాబు వైఖరి దారుణంగా వుందని సజ్జల అంటున్నారు. చంద్రబాబు వైఖరిలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.