Breaking News
  • గుంటూరు: చిలకలూరిపేటలో జేఏసీ నిరసన దీక్ష. దీక్షను ప్రారంభించిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది-ప్రత్తిపాటి. నాపై, నారాయణపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టారు. కోర్టులో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదు-ప్రత్తిపాటి.
  • అమరావతి: ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది-కొల్లు రవీంద్ర. మండలి చైర్మన్‌ షరీఫ్‌పై మంత్రుల వ్యాఖ్యలు సరికాదు. సీఎం జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు-మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
  • విశాఖ: తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు. సబ్బవరం, భీమిలి తహశీల్దార్‌ కార్యాలయాల్లో సోదాలు.
  • ప.గో: 13 జిల్లాలు అభివృద్ధే సీఎం జగన్‌ ఆశయం-సామినేని ఉదయభాను. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ జరగాలి. మండలి చైర్మన్‌ బిల్లులను సలెక్టు కమిటీ పంపడం సరికాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి ఆలస్యం అవుతుంది-సామినేని ఉదయభాను.
  • అమరావతి: సా.4 గంటలకు గవర్నర్‌తో భేటీకానున్న చంద్రబాబు. మండలిలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న బాబు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి. మండలి చైర్మన్‌పై మంత్రులు, వైసీపీ సభ్యుల తీరుపై ఫిర్యాదు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను.. గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు.

ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు- సానియా మీర్జా

, ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు- సానియా మీర్జా

హైదరాబాద్: ప్రముఖ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా మరోసారి పుల్వామా ఘటనపై స్పందించారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న ఈ దారుణం తనని ఎంతో కలిచి వేసిందని ఆమె ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు. అయితే ఘటన జరిగిన రోజున సానియాను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. ఆమె పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే దాడిపై తొలుత సానియా మీర్జా స్పందించలేదు. తను హ్యపీగా ఉన్న వ్యక్తిగత ఫొటోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసి డ్రస్ ఫలానా వాళ్లు డిజైన్ చేశారు, హెయిర్ స్టైలిస్ట్ ఫలానా వాళ్లు అంటూ చెప్పడం వివాదాలకు తావిచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.పుల్వామా దాడిలోనూ పాకిస్థాన్‌ హస్తం ఉండటంతో నెటిజన్లు సానియాపై విమర్శలు చేస్తూ ట్వీట్లు చేశారు. కొంత సేపటి తర్వాత ఆత్మాహుతి దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్వీట్‌ చేసింది. అయినా చాలా మంది భారతీయులు సానియాకు అసలు దేశం పట్ల గౌరవం, అంకింత భావం లేదంటూ విమర్మలు ఎక్కుపెడుతుండటంతో…. మళ్లీ ఈ ఘటన గురించి ఓ లేఖలో రాసి దాన్ని పోస్ట్‌ చేసింది.

, ఫిబ్రవరి 14 ఒక చీకటి రోజు- సానియా మీర్జా

‘పుల్వామా ఘటనపై ప్రముఖులందరూ స్పందించాలనే వారికి ఈ పోస్టు పెడుతున్నాను.మన దేశంలో హింసకు తావు లేదు. హింసకు దారి తీసే అంశాలన్నింటినీ మనం విచ్ఛిన్నం చేయాలి. ఈ దానిని బహిరంగంగా ఖండించాల్సిన అవసరం లేదు. మనం ఉగ్రవాదానికి వ్యతిరేకం అని ఏకతాటిపై నిలబడాలి. నా దేశం గురించి నేను ప్రార్థిస్తున్నాను. దాని కోసం నేను చెమట చిందిస్తున్నాను. ఇదే నేను దేశానికి చేసే సేవ. అమరులైన జవాన్ల కుటుంబ సభ్యులకు నేను మద్దతుగా ఉంటాను. మన దేశాన్ని రక్షిస్తున్న హీరోలకు మనం సాయపడాలి, గౌరవించాలి. 14 ఫిబ్రవరి దేశ ప్రజలకు చీకటి రోజు. మరోసారి ఇలాంటి రోజు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. జవాన్ల కుటుంబాలను మన సంతాపాలు గట్టెకించవు. ఇంకా ఏదో చేయాలి. ఆ రోజును మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. నిందితులను క్షమించకూడదు.ఇలాంటి సమయాల్లో మన దేశానికి సేవ చేసే మార్గాలను వెతుక్కోవాలి కానీ…ఏ ప్రముఖులు ఎలా స్పందిస్తున్నారనేది అప్రస్తుతం. ప్రముఖులు ఎన్ని పోస్టులు పెట్టారు? ఈ భయానక దాడి మీద ఎంత సేపు మాట్లాడరనే దాని గురించి మాట్లాడటం వల్ల ఎవరికీ లాభం లేదు. మీరేమి చేయగలరో అన్నీ చేయండి. సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకోకుండా సాయం చేయండి’ అని లేఖలో చెప్పుకొచ్చింది.