‘అనుకోని అతిధి’గా హైబ్రిడ్ పిల్ల!

హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిధి’గా విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫైజల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా తెలుగులో ఈ సినిమాను ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు. దసరా పండుగ […]

'అనుకోని అతిధి'గా హైబ్రిడ్ పిల్ల!
Follow us

|

Updated on: Oct 09, 2019 | 4:22 AM

హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అథిరన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘అనుకోని అతిధి’గా విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫైజల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రలలో సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మలయాళంలో పెద్ద హిట్ అయింది. దర్శకుడు వివేక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కాగా తెలుగులో ఈ సినిమాను ఇంట్రోపీ ఫిలిమ్స్ బ్యానర్ పై అన్నపురెడ్డి కృష్ణ కుమార్, గోవింద రవి కుమార్ నిర్మిస్తున్నారు.

దసరా పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. ఇటీవల తెలుగులో వరుస ప్లాప్స్ ఎదురుకున్న సాయి పల్లవికి ఈ చిత్రం విజయం ఎంతో కీలకమైంది. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి రానా హీరోగా రూపొందుతున్న ‘విరాటపర్వం’ కాగా.. మరొకటి శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం.