Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

సమంతకు సాయి పల్లవి ఛాలెంజ్.. అక్కినేని కోడలు ఎలా స్పందిస్తుందో..!

పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ ఛాలెంజ్‌ను స్వీకరిస్తోన్న సినీ ప్రముఖులు తాము మొక్కలు నాటుడూ.. తమ తోటి వారిని ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ను విస్తరింపజేస్తున్నారు. ఈ క్రమంలో అక్కినేని హీరో అఖిల్, ఎంపీ సంతోష్ ఇచ్చిన పిలుపు మేరకు తన నివాసంలో మొక్కను నాటాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఆ తరువాత తన తోటి నటులు సాయి పల్లవి, తమన్నా పేర్లను నామినేట్ చేశాడు.

ఇక ఆ సవాల్‌ను స్వీకరించిన మలార్ బ్యూటీ.. తాజాగా తన ఇంటి ప్రాంగణంలో మొక్కలు నాటింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పల్లవి.. తన ఛాలెంజ్‌ను స్వీకరించాలంటూ సమంత, రానాలను ట్యాగ్ చేసింది. మరి ఆ ఇద్దరు సాయి పల్లవి ఛాలెంజ్‌కు ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా గతేడాది ‘పడి పడి లేచే మనసు’లో కనిపించిన సాయి పల్లవి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న విరాట పర్వం ఒకటి. ఇందులో రానా సరసన సాయి పల్లవి కనిపించనుంది. ఈ మూవీతో పాటు నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమె నటించనుంది. ఈ నెలలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది.