Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ. ఎమెర్జెన్సీ పనులు నిమిత్తం తమను కంపెనీలోకి అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎల్జీ పాలిమర్స్. రోజు వారీ కార్యకలాపాల కోసం కంపెనీలోనికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు 30 మందికి అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పత్రం ఇవ్వలేదన్న కంపెనీ తరుపు న్యాయవాది.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

రాశీఖన్నా సాంగ్ పాడుతుంటే నిద్రపోయిన మెగాహీరో..

Sai Dharam Tej turned to Sleep when Rashi Khanna Singing, రాశీఖన్నా సాంగ్ పాడుతుంటే నిద్రపోయిన మెగాహీరో..

అందాల బొమ్మ రాశీ ఖ‌న్నా ఇప్పుడు టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తుంది. అయితే రాశీ కేవలం నటి మాత్ర‌మే కాదు..మంచి గాయని కూడా. గ‌తంలో ‘జోరు అనే సినిమాలో ఓపాట కూడా పాడింది ఈ భామ. ఇటీవలే సాయిధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి ‘ప్రతిరోజూ పండగే’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీ. ఆ సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఇంటర్య్వూలోని ఓ ఫ‌న్నీ ఇన్సిడెంట్ ను తాజాగా ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

ఇంటర్వ్యూ మధ్య గ్యాపులో రాశీఖన్నా.. ‘ఏం సందేహం లేదు…అంటూ త‌న‌ ‘ఊహ‌లు గుస‌గుస‌లాడే’ చిత్రంలోని పాట‌ను అందుకుంది . ఈ స‌మ‌యంలో ఆమె పక్కనే ఉన్న హీరో సాయిధరమ్ తేజ్ చిన్న‌గా ఓ కునుకు తీశాడు. ఈ స‌న్నివేశాన్ని పక్క‌నే ఉన్న దర్శకుడు మారుతి త‌న మొబైల్ ఫోన్ లో చిత్రీక‌రించాడు. తాజాగా ఆ వీడియోను పోస్ట్ చేసిన రాశీ.. ‘సాయిధరమ్ తేజ్ నా సింగింగ్ విని నిద్రపోయాడు. కానీ మీరు ఈ సాంగ్ విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. అన్నట్లు మీ హృదయంతో పాడటానికి ఇది స‌రైన టైమ్’ అంటూ రాసుకొచ్చింది అందాల రాశీ ఖ‌న్నా.

Related Tags