ఫస్ట్‌లుక్‌తోనే అట్రాక్టీవ్‌గా.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

Sai Dharam Tej new look revealed from his upcoming film Prathi Roju Pandage, ఫస్ట్‌లుక్‌తోనే అట్రాక్టీవ్‌గా.. సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా

సుప్రీమ్ హీరో సాయి ధరమ్‌ తేజ్ హీరోగా నటిస్తోన్న మరో కొత్త సినిమా.. ‘ప్రతీ రోజూ పండగే’. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖన్నా నటిస్తోంది. కాగా.. ఇందులో.. ప్రధానమైన పాత్రలో.. సత్య రాజ్ నటిస్తున్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించగా.. నిర్మాత అరవింద్ సమర్పణలో.. తాజాగా.. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే.. ఈరోజు సినిమా ఫస్ట్‌లుక్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పిక్చర్‌లో సాయి ధరమ్‌ తేజ్ గొడుగు పట్టుకుని.. సత్యరాజ్‌కి జాగ్రత్తలు చెబుతున్నట్టు.. సత్యరాజ్ చిన్నపిల్లాడిలా గంతులు వేస్తున్నట్లు చిత్రంలో కనిపిస్తోంది. పచ్చటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరినీ అలరిస్తోంది. ‘ప్రతీరోజూ పండగే’ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ఓ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *