గ్లోవ్స్‌ ధరిస్తే కీపర్ కాలేరు.. మాజీ‌ల ధ్వజం!

విండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా ఒకేరమైన చెత్త షాట్స్ ఆడుతూ వికెట్‌ను సమర్పించుకుంటున్న పంత్‌‌ను ఇప్పటికే పలువురు మాజీలు విమర్శించగా.. తాజాగా ఆ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా చేరాడు. గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ తీవ్రంగా మండిపడ్డాడు. అటు వృద్ధిమాన్ సాహను వెనకేసుకొచ్చిన కిర్మాణీ.. పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చి.. సాహాను మేనేజమెంట్ పట్టించుకోవట్లేదని […]

గ్లోవ్స్‌ ధరిస్తే కీపర్ కాలేరు.. మాజీ‌ల ధ్వజం!
Follow us

|

Updated on: Aug 28, 2019 | 12:18 PM

విండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా ఒకేరమైన చెత్త షాట్స్ ఆడుతూ వికెట్‌ను సమర్పించుకుంటున్న పంత్‌‌ను ఇప్పటికే పలువురు మాజీలు విమర్శించగా.. తాజాగా ఆ జాబితాలోకి భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ కూడా చేరాడు. గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరంటూ తీవ్రంగా మండిపడ్డాడు. అటు వృద్ధిమాన్ సాహను వెనకేసుకొచ్చిన కిర్మాణీ.. పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చి.. సాహాను మేనేజమెంట్ పట్టించుకోవట్లేదని విమర్శించాడు.

మేటి వికెట్ కీపర్‌గా ఎదగాలని పంత్‌కు అవకాశాలు ఇస్తున్న మాదిరిగానే.. సాహను కూడా ప్రోత్సహించాలని అన్నాడు. ‘ పంత్‌‌కు కావాల్సినంత టాలెంట్‌ ఉంది. కానీ అతను ఇంకా చాలా నేర్చుకోవాలి. అతనికి సమయం కూడా ఎక్కువే ఉంది. అటువంటి సందర్భంలో సాహను నిర్లక్ష్యం చేయడం తగదు. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో సాహాకు చోటు దక్కకపోవడం నిరాశకు గురి చేసింది. సాహా మంచి వికెట్‌ కీపరే కాదు.. బ్యాట్స్‌మన్‌ కూడా. ఆ విషయాన్ని మరిచిపోకండి. ఒక జత కీపింగ్‌ గ్లోవ్స్‌ ధరించిన ప్రతీ ఒక్కరూ వికెట్‌ కీపర్‌ కాలేరు కదా’ అంటూ కిర్మాణీ చురకలంటించాడు. కనీసం రెండో టెస్టులోనైనా సాహాకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా జట్టుకు దూరమైన సాహా.. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికైన టెస్ట్ జట్టులో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ.. తొలి టెస్టుకు సాహాకు బదులుగా పంత్‌ను తీసుకున్నాడు. వన్డేలు, టీ20ల్లో ఘోరంగా విఫలమైన పంత్‌కే మళ్ళీ చోటు ఇవ్వడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!