ప్రజ్ఞాకు మోదీ సర్కార్ షాక్.. రక్షణరంగ కమిటీ నుంచి ఔట్

వివాదాస్పద ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. రక్షణ రంగ కమిటీ నుంచి  ఆమెను తొలిగిస్తున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. అంతేకాదు పార్లమెంట్ క్రమశిక్షణా సంఘం నుంచి కూడా ఆమెకు వీడ్కోలు పలికారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా  బుధవారం పార్లమెంట్‌లో సంచలన కామెంట్ చేశారు. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ ఇమేజ్‌కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీ ప్రజ్ఞాపై […]

ప్రజ్ఞాకు మోదీ సర్కార్ షాక్.. రక్షణరంగ కమిటీ నుంచి ఔట్
Follow us

|

Updated on: Nov 28, 2019 | 12:54 PM

వివాదాస్పద ఎంపీ సాద్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది. రక్షణ రంగ కమిటీ నుంచి  ఆమెను తొలిగిస్తున్నట్లు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ప్రకటించారు. అంతేకాదు పార్లమెంట్ క్రమశిక్షణా సంఘం నుంచి కూడా ఆమెకు వీడ్కోలు పలికారు. మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ ప్రజ్ఞా  బుధవారం పార్లమెంట్‌లో సంచలన కామెంట్ చేశారు. దీంతో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ ఇమేజ్‌కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండటంతో బీజేపీ ప్రజ్ఞాపై వేటు వేసింది. ఇక పార్లమెంట్‌లో బీజేపీ సమావేశాల వేటికీ కూడా ఆమెకు ఆహ్వానం ఉండదని పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నటు జేపీ నడ్డా తెలిపారు.

కాగా ప్రజ్ఞా సింగ్  వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఆర్‌‌ఎస్‌ఎస్, బీజేపీ భావజాలన్ని ఆమె భయటపెట్టారని ఆరోపించారు. కాగా సాద్వీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో స్పీకర్ స్పందించారు. ప్రజ్ఞా  మాటలను రికార్డుల నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు.