Breaking News
  • సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ లో పనిచేస్తున్న సెక్షన్ అఫిసర్ కు కరోనా పాజిటివ్ గుర్తింపు.. ఇటీవల ఢిల్లీ వెళ్లాడని తెలిసి కరోనా టెస్టులు... టెస్టు చేసిన అనంతరం పాజిటివ్ గా వచ్చినట్లు గుర్తింపు.. గాంధీ ఆస్పత్రి కి తరలించిన అధికారులు.. బిఆర్కే భవనం మొత్తం షానిటైజేషన్ చేస్తున్న అధికారులు.
  • మర్కజ్ ఘటనపై వివరాలు సేకరించిన కేంద్ర హోంశాఖ. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
  • దేశవ్యాప్తంగా మొత్తం 1418 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఈ రోజే 167 పాజిటివ్ కేసులు నమోదు. దేశ వ్యాప్తంగా కరోనా తో 45 మంది మృతి. ఈ ఒక్క రోజే 13 మంది కరోనా తో మృతి చెందినట్లు వెల్లడి. కరోనా నుంచి 123 మంది డిశ్చార్జి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిత్వ శాఖ.
  • ఉక్రెయిన్​లో చిక్కుకున్న 300 మంది తెలుగు విద్యార్థులు. తిండి లేక ఆకలితోనే గడుపుతున్న విద్యార్థులు. చేతిలో చిల్లి గవ్వ లేక ఎన్నో ఇబ్బందులు. కరోనా రక్కసి మింగేస్తుందేమోననే భయంతో బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు.
  • తెలంగాణ లో ఇప్పటి వరకు 97 కేసులు నమోదు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులు. ఈ ఒక్క రోజు 15 పాజిటివ్ కేసులు నమోదు. 14 మంది డిశ్చార్జ్,6 మృతి...

Laureus Award: క్రికెట్ దేవుడికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!

Sachin Tendulkar's World Cup triumph, Laureus Award: క్రికెట్ దేవుడికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!

క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020 అవార్డును సచిన్ అందుకున్నారు. గత రెండు దశాబ్ధాల్లో అత్యుత్తమ స్పోర్ట్స్ మూవెంట్‌కు ఈ అవార్డును అందించడం కోసం ఇటీవల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో 19మందితో పోటీపడిన మాస్టర్ బ్లాస్టర్ ప్రథమ స్థానంలో నిలిచి అవార్డును సొంతం చేసుకున్నారు. కాగా 2011లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ విజయం తరువాత సచిన్‌ను భారత ఆటగాళ్లు తమ భుజాలపై ఎత్తుకొని ఊరేగించిన విషయం తెలిసిందే. దీనికి క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ నేషన్ అనే క్యాప్షన్‌తో ఓటింగ్ నిర్వహించగా.. ఆ మూవెంట్‌కే ఈ అవార్డు వచ్చింది.

Sachin Tendulkar's World Cup triumph, Laureus Award: క్రికెట్ దేవుడికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..!

ఈ నేపథ్యంలో జర్మనీలోని బెర్లిన్‌లో లారెస్ అవార్డును అందుకున్న సచిన్ అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. అవి అద్భుత క్షణాలు. నాకు పదేళ్ల వయసున్నప్పుడు భారత్ ప్రపంచకప్‌(1983)ను గెలిచింది. ఆ సమయంలో నాకు దాని మీద పెద్ద అవగాహన లేకపోయినా. ఆ విజయాన్ని అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నా. కొంతకాలానికి ప్రపంచకప్ విజయం ఎంత ప్రత్యేకమైందో అర్థమైంది. దీంతో మరోసారి దేశానికి ప్రపంచకప్ సాధించాలనే కోరికతో క్రికెట్ ఆడటం మొదలుపెట్టా. 22 ఏళ్ల తరువాత నా కల నెలవేరింది అని వ్యాఖ్యానించారు. తాను గెలిచిన ఈ ట్రోఫీ.. తానొక్కడితే కాదని.. అందరిదీ అని సచిన్ అన్నారు. ఇక 19ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే తనపై దక్షిణాఫ్రికా సూరీడు నెల్సన్ మండేలా ప్రభావం ఉండేదని సచిన్ అన్నారు.

Related Tags