టెస్టుల్లో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ సరైన ఆప్షన్.. సచిన్ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ టూర్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టులు ఆడనుంది.

  • Ravi Kiran
  • Publish Date - 8:18 pm, Wed, 25 November 20
టెస్టుల్లో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ సరైన ఆప్షన్.. సచిన్ కీలక వ్యాఖ్యలు..

Sachin Tendulkar: టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. సుదీర్ఘంగా సాగే ఈ టూర్‌లో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, ఐదు టెస్టులు ఆడనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి వచ్చేస్తుండటంతో ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం అని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపధ్యంలో టీమిండియాకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పలు సూచనలు ఇచ్చాడు.

టెస్టుల్లో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ కరెక్ట్ ఆప్షన్ అని సచిన్ అన్నాడు. ఈ మధ్య కాలంలో అతడు తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడని కితాబిచ్చాడు. ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధిస్తే.. మయాంక్‌కు సరైన జోడి అవుతాడని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ నుంచి ఫామ్ కంటిన్యూ చేస్తున్న ఆటగాళ్ళను యాజమాన్యం పక్కన పెట్టదని సచిన్ పేర్కొన్నాడు.

Also Read: 

ఏపీ: డిసెంబర్ 14 నుంచి 6,7 తరగతుల విద్యార్ధులకు క్లాసులు.. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు..]

ప్రముఖ నటుడు అషీష్ రాయ్ క‌న్నుమూత‌.. తీవ్ర విషాదంలో బాలీవుడ్ ఇండస్ట్రీ..

బిగ్ బాస్ 4: ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆ భామేనా.!