ఆ నిర్ణయమే భారత్ కొంపముంచిందా.?

Virat Kohli MS Dhoni, ఆ నిర్ణయమే భారత్ కొంపముంచిందా.?

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ‘భారత్ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని’ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విఫలమైన ధోని క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించిందని అన్నాడు. ధోని, జడేజా ఆటతీరు అద్భుతమని సచిన్ కొనియాడాడు. భారత్‌ను భారీ ఓటమి నుంచి తప్పించిన రవీంద్ర జడేజా, ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇది జడేజా కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది. వీర్దిదరూ ఏడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బాటలు వేశారు. కానీ చివర్లో ఒత్తిడికి లోనయ్యి వికెట్లు కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది.

ఇది ఇలా ఉండగా ధోని తన సమయానికి రావాల్సిన దానికన్నా ఆలస్యంగా రావడం మ్యాచ్‌పై ప్రభావం చూపించిందని సచిన్ స్పష్టం చేశాడు. ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా బదులు ఎం.ఎస్. ధోని బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. అలా వచ్చి ఉంటే ధోని ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేసేవాడని.. అప్పుడు మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని తెలిపాడు. ఈ విషయంలో మేనేజ్‌మెంట్ ఖచ్చితంగా పొరపాటు చేసిందని సచిన్ పేర్కొన్నాడు.

అటు టీమిండియా ఓటమిపై నెటిజన్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ధోని ఎందుకు డ్రెస్సింగ్ రూమ్ ఎందుకు అంత సేపు ఉన్నాడని నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించడం కూడా పలు ఊహాగానాలకు తావిస్తున్నాయి. కొంతమంది టాప్ ఆర్డర్ ఆటగాళ్లపై మండిపడుతుండగా.. మరికొందరు ధోని ముందే వచ్చి ఉంటే ఆటతీరు మరోలా ఉండేదని భావిస్తున్నారు. ఇక ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *