అతడు టీమ్ ను సమర్థవంతంగా నడపగలడు.. అజింక్యా రహానెపై సచిన్ టెండూల్కర్ పొగడ్తలవర్షం
టీమిండియా బాట్స్ మెన్ అజింక్యా రహానె మీద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పొగడ్తలవర్షం కురిపించాడు. కోహ్లీ లేనప్పుడు రహానె టీమ్ ను అద్భుతంగా నడపగలదని సచిన్ అన్నారు.
టీమిండియా బాట్స్ మెన్ అజింక్యా రహానె మీద మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పొగడ్తలవర్షం కురిపించాడు. కోహ్లీ లేనప్పుడు రహానె టీమ్ ను అద్భుతంగా నడపగలదని సచిన్ అన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సచిన్ ఆటలాడుతూ.. రహానే బుద్ధిశాలి అని, అతడు జట్టును సమర్థవంతంగా నడపగలడని సచిన్ అబిప్రాయపడ్డారు. విరాట్‌కు, రహానెకు తేడా ఉంటుందని, రహానె చాలా తెలివైనవాడు. స్థిరంగా ఆలోచించే మనస్తత్వం అతడిదని సచిన్ కొనియాడారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకున్నా టెస్ట్ సిరీస్ గెలవగలిగిన ప్రతిభ జట్టుకు ఉందని సచిన్ అన్నారు. మన బ్యాటింగ్‌లో ఎంతో డెప్త్ ఉంది. జట్టు కోసం ప్రతి ఒక్కరూ తమతమ బాధ్యతలను నిర్వర్తించాలని సచిన్ సూచించారు.