అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకోనున్న ఆలయం

రెండు నెలల దర్శనాల నిమిత్తం ఆలయం నవంబరు 16వ తేదీన ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా దాదాపు 5 నెలలపాటు శబరిమల అయ్యప్ప స్వామివారి ఆలయం తెరుచుకోలేదు.ఈ మహమ్మారి వలన భక్తులు కి దేవునికి మధ్య దూరం పెరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. తెరుచుకోనున్న ఆలయం
Follow us

|

Updated on: Sep 15, 2020 | 2:56 PM

Sabarimala Temple Reopen : శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దీపావళి తరువాతే తెరుచుకోనుంది. సాధారణ భక్తులకు స్వామివారి దర్శనం కోసం మార్గదర్శనాలను త్వరలోనే విడుదల చేయనుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో భక్తుల ప్రవేశానికి సంబంధించి ఆలయం బోర్డు నిబంధనలు సిద్ధం చేస్తోంది. నవంబర్ 16 నుంచి అయ్యప్ప దర్శనం ఉండే అవకాశం ఉంది. ఆలయంలో దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక కమిటీ కొన్ని సూచనలు చేసింది.

ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అయ్యప్ప స్వామి దర్శనం గురించి వివరించే స్థితిలో లేనందున ప్రత్యేక కమిటీ తన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకోవాలని అనుకున్న భక్తులు దర్శనానికి ముందు 14 రోజులు, దర్శనం తర్వాత 10 రోజులు స్వీయ నిర్బంధంలో గడపాల్సి ఉంటుంది. ఆలయంలో జరిపే పూజలకు ఎవరినీ అనుమతించరు.

సెప్టెంబర్ 16 నుంచి 21 వరకు నెలవారీ ఆరాధన కోసం ఆలయం తెరుచుకోనుంది. అయితే ఈ సమయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతి లేదు. మకర సంక్రాంతి రోజు కనిపించే మకరవిలక్కు, మెట్ల పూజపై మార్గదర్శకాలను త్వరలోనే ఆలయ ప్రత్యేక కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుందిన ప్రకటించింది.

మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
మళ్లీ గెలుపు నాదే.. కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
వీటితో మీ గ్యాస్ స్టవ్‌ను క్లీన్ చేయండి.. తళుక్కుమంటుంది..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
పవన్ కళ్యాణ్ ఇద్దరు పిల్లలకు ఏ సిటిజన్ షిప్ ఉందో తెలుసా..
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇద్దరు భారతీయులు.. 10 ఏళ్ల జైలు శిక్ష?
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
మామిడి పండు తొక్కతో మీ అందం రెట్టింపు చేసుకోండిలా..
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
తెలంగాణ ఇంటర్‌ 2024 సప్లిమెంటరీ, రీకౌంటింగ్‌ షెడ్యూల్‌ ఇదే
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
రైలు జనరల్ బోగీ బిక్కుబిక్కుమంటూ కనిపించిన యువకులు..
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
టీ20 ప్రపంచకప్‌నకు టీమిండియా స్వ్కాడ్.. ఇద్దరు కీలక ప్లేయర్లు ఔట్
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
బ్లాక్ కాఫీ తాగితే గుండెకు ఎంతో మేలు.. డోంట్ మిస్!
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర
పులివెందులలో నామినేషన్‌ వేయనున్న సీఎం జగన్.. క్లైమాక్స్‌కి యాత్ర