గెట్ రెడీ డార్లింగ్స్… ‘సాహో’ గేమ్ వచ్చేస్తోంది!

Saaho Video Game Launching Soon, గెట్ రెడీ డార్లింగ్స్… ‘సాహో’ గేమ్ వచ్చేస్తోంది!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత ఈ భారీ బడ్జెట్ యాక్షన్ సినిమా వస్తుండడంతో దీనిపై సినీ క్రిటిక్స్‌తో పాటు ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది ఇలా ఉండగా యూవీ క్రియేషన్స్ తాజాగా అభిమానులకు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్‌ను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ గేమ్‌ని ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్సలాట్ ల్యాబ్స్ డెవలప్ చేస్తోంది. కాగా ఈ గేమ్ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *