Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

టీజర్‌కే దుమ్ము రేపుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్..షాకైన శ్రద్ధ

, టీజర్‌కే దుమ్ము రేపుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్..షాకైన శ్రద్ధ

హైదరాబాద్‌: ‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్ర టీజర్ ఇటీవలే రిలీజై సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఇప్పటివరకు దాదాపు ఆరు కోట్ల మందికి పైగా టీజర్‌ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అయితే శ్రద్ధ పోస్ట్‌ చేసిన వీడియో ఇక్కడి థియేటర్‌ లోనిదా? లేక ముంబయిలోని థియేటర్‌లో చిత్రించిందా అన్నది తెలియరాలేదు. ‘సాహో’ సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.