Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

‘Saaho’ pre-release event: ప్రభాస్ వాడిన బైక్స్, కార్స్, గన్స్ చూస్తారా?

Saaho Pre Release Event, ‘Saaho’ pre-release event: ప్రభాస్ వాడిన బైక్స్, కార్స్, గన్స్ చూస్తారా?

బాహుబలి ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది.’సాహో’ సినిమాకు సుజిత్‌ దర్శకుడు. శ్రద్ధాకపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.దాదాపు లక్షమంది అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానున్నారు. రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు విశేషమైన స్పందన లభించింది. సినిమాలోని పలు యాక్షన్​ సన్నివేశాలలో వాడిన వాహనాలు, బంకర్లు, లైట్లతో అలంకరణలు చేశారు.ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ యూజ్ చేసిన బైక్స్, గన్స్, కార్లు టీవీ9 వీక్షకుల కోసం స్పెషల్‌గా ఈ వీడియోలో…

 

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Related Tags