‘దెయ్యం’ మొదటి టికెట్ కొన్న డార్లింగ్!

Sahoo Prabhas Ninu Veedani Needanu Nene Movie, ‘దెయ్యం’ మొదటి టికెట్ కొన్న డార్లింగ్!

హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ సినిమాతో సందీప్ కిషన్ ప్రొడ్యూసర్‌గా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. రేపు రిలీజవుతున్న ఈ మూవీ మొదటి టికెట్‌ను ‘డార్లింగ్’ ప్రభాస్‌తో అమ్మకాలు మొదలు పెట్టింది చిత్ర యూనిట్.

ప్రసాద్ మల్టీ‌ప్లేక్స్‌లోని మొదటి షోకు ప్రభాస్  1116 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. ఈ శుక్రవారం ‘నిను వీడని నీడను నేనే’కు ‘దొరసాని’, ‘రాజ్‌దూత్’ సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నా హీరో సందీప్ కిషన్ సినిమా సక్సెస్‌పై ధీమాగా ఉన్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పూర్తి హారర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభాస్ టికెట్ కొనడంతో ఈ సినిమాకు హైప్ వచ్చిందనే చెప్పాలి. కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అన్య సింగ్ హీరోయిన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *