Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

Saaho: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

Saaho Pre Release Function, Saaho: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

‘బాహుబలి’ ప్రభాస్ నటించిన ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రభాస్ అభిమానులు సుమారు లక్షమందికి సరిపోయే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది. ఇక వేడుక ప్రారంభమైన తరవాత ప్రభాస్ ఫ్యాన్స్ పోలీసులకు చుక్కులు చూపిస్తున్నారు.

విపరీతంగా అభిమానులు పోటెత్తడం..ముందుకు వెళ్లేందుకు  కొంత మంది భారీకేడ్లను పడగొట్టుకుని ముందుకు వచ్చేస్తుండంతో పోలీసులకు కంట్రోల్ చెయ్యడం కష్టతరంగా మారింది. యాంకర్స్ సుమ, హేమంత్ సంయమనంతో ఉండాలని ఫ్యాన్స్‌కు పదే పదే మైక్‌లో విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక పోలీసులు డ్రోన్ కెమెరా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ప్రభాస్ ఎంట్రీ అవ్వలేదు. ఆయన ఎంట్రీ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందనే టాక్ నడుస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కేవలం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసమే 2 కోట్ల 50 లక్షలు ఖర్చు పెడుతోంది.

 

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Related Tags