సాహో బెనిఫిట్ షోలు ఫిక్స్?

Saaho Movie Benefit Show Tickets, సాహో బెనిఫిట్ షోలు ఫిక్స్?

ఆగస్టు 30న రాబోయే సాహో కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రమోషన్ ఊపందుకోగా రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అది పీక్స్ కు చేరనుంది. ఇదిలా ఉండగా సాహో బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఒకరోజు ముందుగానే అంటే 29 రాత్రి ఎంపిక చేసిన కేంద్రాల్లో థియేటర్లలో సాహో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్టు వినికిడి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం ఇప్పటికే యూనిట్ తరపున ప్రభుత్వాలకు అభ్యర్థన వెళ్లిందని అనుమతి రాగానే ప్రకటిస్తారని తెలిసింది. ఈసారి ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఇలాంటి షోలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక్క బాహుబలి 2కు మాత్రమే గతంలో ఇలాంటి స్క్రీనింగ్ సాధ్యపడింది. కానీ చాలా తక్కువ స్క్రీన్లు ఇవ్వడం పట్ల అధిక శాతం ఒకరోజు ముందు చూడలేకపోయారు. ఇప్పుడీ వార్త నిజమైతే డార్లింగ్ ఫ్యాన్స్ అందరి కంటే ముందే సాహో చూసేయొచ్చన్న మాట.

ఇక్కడ సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూడండి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *