ఇది ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం..కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!

Prabhas achieves a record with Saaho in overseas box office, ఇది ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం..కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్!

ఏంటి ప్రభాస్ ఇది? ఈ కలెక్షన్ల ఊచకోత ఏంటి?. డివైడ్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు ఈ స్థాయిలో రావడం నిజంగా ఏ లాంగ్వేజ్ హీరో అందుకోని ఫీట్. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. విడుదలయిన 7 రోజుల్లోనే సాహో ప్రపంచవ్యాప్తంగా 370 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది.

‘సాహో’తో ప్రభాస్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. యూఎస్​లో 3 మిలియన్ డాలర్ల క్లబ్​లో చేరిన ఐదో తెలుగు చిత్రంగా‘సాహో’ నిలిచింది. ఈ జాబితాలో బాహుబలి-2(12 మిలియన్ డాలర్లు) టాప్​లో ఉంది. తర్వాతి స్థానాల్లో బాహుబలి(6.9 మిలియన్ డాలర్లు), రంగస్థలం(3.5 మిలయన్ డాలర్లు), భరత్​ అనే నేను(3.4 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.

‘సాహో’లో శ్రద్ధా కపూర్ హీరోయిన్​గా నటించింది. అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, మహేశ్​ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్​ నేపథ్య సంగీతమందించాడు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *