నన్ను క్రిమినల్‌లా చూస్తున్నారు: సుజీత్

Saaho Director Sujeeth Breaks Silence On Criticism: 'As If I Have Committed A Crime', నన్ను క్రిమినల్‌లా చూస్తున్నారు: సుజీత్

సుజీత్ దర్శకత్వం‌లో ఇటీవలే వచ్చిన సినిమా సాహో. ఈ సినిమా అనూహ్యం‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలమవడంతో సుజీత్ మీద నెగటివిటీ పెరిగిపోయింది.  కానీ సుజీత్ దానిని తప్పుగా అర్ధం చేసుకున్నాడు. ఇటీవలే డెంగీ జ్వరం బారిన పడి కోలుకుంటున్న సుజీత్ తాజాగా సాహో విషయంలో తనపై వస్తున్న విమర్శలపై రియాక్ట్ అవుతూ… ”నేను ప్రభాస్ సర్‌తో సినిమా చేశాను. నా నిర్మాతలు, నేను కథను నమ్మి తీశాం. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ చిత్రం చూశారు. అయినప్పటికీ నేను ఏదో నేరం చేసినట్లు ట్రీట్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చారు. నన్ను టార్గెట్ చేస్తూ అందరూ ఎందుకు వార్తలు రాస్తున్నారో అర్థం కావడం లేదు. నేను చివరగా మూవీ రిలీజైన ఒక రోజు తర్వాత ఇంటర్వ్యూ ఇచ్చాను. ‘నో కామెంట్స్’ అని నేను చెప్పినా కూడా అది ఇంటర్వ్యూగా మారిపోతోంది, ఆ కామెంట్లను కూడా నాకు వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని సుజీత్ తెలిపారు.

నేను మూర్ఖంగా గొప్పులు చెప్పుకునే రకం కాదు. అభిమానులు రజనీకాంత్, మమ్ముట్టి లాంటి గొప్ప గొప్ప స్టార్ల కోసం ఆలయాలు కట్టారు. అలాంటి ఆలయాల వద్ద నేను భక్తుడిని మాత్రమే. సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. సినిమాను ప్రేమించండి లేదా ద్వేషించండి. అంతే కానీ నన్ను టార్గెట్ చేయడం ఎందకు? అని సుజీత్ వాపోయారు. నిజానికి సుజీత్ ఒక క్రైమ్ చేసాడు అని ఎవరూ భావించడం లేదు, ఏ దర్శకుడు ప్లాప్ సినిమా తీసినా జరిగేది ఇదే. అంతకు మించి మరొకటి లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *