Breaking News
  • ఆదిలాబాద్‌: నేటి నుంచి నాగోబా జాతర. ఇంద్రవెళ్లి మండలం కేస్లాపూర్‌లో ప్రారంభంకానున్న జాతర. జాతరకు రానున్న తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఆదివాసీలు, గిరిజనులు.
  • అవినీతి సూచిలో భారత్‌కు 80వ స్థానం. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై వ్యాపారవర్గాలు నుంచి.. వివరాలు సేకరించిన ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ సంస్థ. అవినీతి కట్టడిలో తొలిస్థానంలో నిలిచిన డెన్మార్క్‌, న్యూజిలాండ్‌.
  • వలసల నియంత్రణకు ట్రంప్‌ సర్కార్‌ మరో కీలక చర్య. అమెరికా వచ్చే విదేశీ గర్భిణులపై ఆంక్షలు విధింపు. కాన్పు కోసమే అమెరికా వచ్చేవారికి పర్యాటక వీసా నిరాకరణ.
  • రోహింగ్యాల ఊచకోతపై అంతర్జాతీయ న్యాయస్థానం సంచలన తీర్పు. మయన్మార్‌లో రోహింగ్యాల నరమేధం జరిగింది. సైన్యం అండతో రోహింగ్యాలను ఊచకోత కోశారన్న న్యాయస్థానం. రోహింగ్యాలను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశం.
  • కరోనా వైరస్‌కు కారణం పాములే. చైనా అధ్యయనంలో వెల్లడి. ఐదు నగరాలకు రాకపోకలన్నీ నిలిపివేసిన చైనా. వుహాన్‌, హుయాంగ్‌గాంగ్‌, ఎఝౌ, ఝిజియాంగ్‌.. ఖియాన్‌జింగ్‌ నగరాలపై రవాణా ఆంక్షలు విధింపు.

Saaho: ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు.. ఎక్కడంటే..!

Saaho pre-release event date confirmed, Saaho: ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు.. ఎక్కడంటే..!

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 18న సాహో ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో జరిగే ఈ కార్యక్రమంలో సాహో యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలోనే సాహో ట్రైలర్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.

కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించగా.. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ, మురళీ శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీలో ఒకేరోజు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్లతో ఆకట్టుకున్న ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.