Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

ఇది ఏ హీరో సాధించని ఫీట్..ప్రభాస్‌కి ‘సాహో’ అంటున్న బాక్సాఫీస్

Saaho latest box office collection, ఇది ఏ హీరో సాధించని ఫీట్..ప్రభాస్‌కి ‘సాహో’ అంటున్న బాక్సాఫీస్

ఇది మాములు మ్యాజిక్ కాదండి. డివైడ్.. ఇంకా చెప్పాలంటే ఆల్మోస్ట్ ప్లాప్ టాక్ వచ్చిన సినిమాకు కలెక్షన్లు అదరగొడుతున్నాయి. యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్​ హీరోగా నటించిన ‘సాహో’.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీతో రికార్డులు సృష్టిస్తోంది. అసలు ఏం జరుగుతుందోొ బీ టౌన్ జనాలకు అర్ధం కావడంలేదు. సౌత్ సినిమాలకు, మన వాళ్ల కంటెంట్‌కు అక్కడి మాస్ జనాలు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఖాన్స్ హిట్టు కోసం ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తుంటే..మన వాళ్లు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. ఇంతకు ముందెన్నడూ ఏ స్టార్ అందుకోని ఫీట్ ఇది.  విడుదలైన నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్ల గ్రాస్​ వసూలు చేసిన ఈ చిత్రం.. మరో అరుదైన ఘనత సాధించింది. వైరల్డ్‌వైడ్‌గా వీకెండ్‌లో అత్యధిక మొత్తం సాధించిన రెండో సినిమాగా నిలిచింది. ఈ జాబితా టాప్​లో హాలీవుడ్​ చిత్రం ‘హాబ్స్ అండ్ షా’ ఉంది. తర్వాతి స్థానాల్లో ‘ద లయన్ కింగ్’, ‘వన్స్ అపాన్​ ఏ టైమ్​ ఇన్ హాలీవుడ్’, ‘ఏంజల్ హ్యాస్ ఫాలెన్’ ఉన్నాయి.

బాలీవుడ్​లో రూ.100 కోట్లకు చేరువలో ఉంది ‘సాహో’. అంటే అక్కడ సినిమా మంచి హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయాన్ని ‘సాహో’కి 1\2 రివ్యూ ఇచ్చిన ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్​లో పంచుకున్నాడు. ప్రస్తుతం రూ.93.28 కోట్ల వసూళ్లతో సెంచరీ వైపు పరుగులు పెడుతోందీ చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్​గా శ్రద్ధా కపూర్ నటించింది. జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.

Related Tags