200 కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్..’సాహో’ ప్రభాస్ అంటున్న బాక్సాఫీస్

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద సెంచరీ కొట్టింది. ఈ చిత్రం ఓపెనింగ్‌ రోజున రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ మిక్డ్స్ టాక్‌ అందుకుంది. ‘బాహుబలి’ హిట్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. కాగా రెండో రోజు కూడా […]

200 కోట్లు కొల్లగొట్టిన డార్లింగ్..'సాహో' ప్రభాస్ అంటున్న బాక్సాఫీస్
Saaho Box Office Collection Day 2
Follow us

|

Updated on: Sep 01, 2019 | 4:32 PM

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై విడుదలైన తెలుగు సినిమా ‘సాహో’ తొలిరోజున బాక్సాఫీసు వద్ద సెంచరీ కొట్టింది. ఈ చిత్రం ఓపెనింగ్‌ రోజున రూ.100 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సాహో’ మిక్డ్స్ టాక్‌ అందుకుంది. ‘బాహుబలి’ హిట్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన సినిమా ఇది. సుజీత్‌ దర్శకుడు. శ్రద్ధా కపూర్‌ హీరోయిన్ దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. కాగా రెండో రోజు కూడా ఈ చిత్రం టాక్‌తో పనిలేకుండా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.

రెండు రోజులకు కలిపి తెలుగు, తమిల వెర్షన్‌లో మాత్రమే రూ. 87 కోట్లు రాబట్టినట్టు సమాచారం.  హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 28 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఓవర్సీస్ హిందీ విషయానికొస్తే.. మరో రూ.10 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా రూ 70  కోట్లుకు వసూలు చేసినట్టు బాలీవుడ్  ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. అయితే ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ రెండో రోజు కూడా బాక్స్ ఆఫీస్‌ని కలెక్షన్స్ వరదతో ముంచెత్తడం ఆశ్చర్యపరిచే విషయం. దీంతో రెండు రోజులకి సాహో కలెక్షన్స్ ఇండియా గ్రాస్ రూ. 164.9 కోట్లుగా ఉంది. షేర్ రూ. 99.4 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.205 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది.

మూడో రోజు ఇదే ఊపు కొనసాగితే.. వినాకయ చవితి సెలవు కూడా కలిసివస్తుంది కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర ‘సాహో’ అద్భుతాలు చెయ్యకపోయినా సేఫ్ అయిపోవడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. మరో సినిమా పోటీ లేకపోవడం, నిర్మాతల సమన్వయం, బాహుబలి ఎఫెక్ట్ సినిమాకి వైడర్ రేంజ్‌ని తీసుకువచ్చాయి. యావరేజ్ టాక్‌తోనే ప్రభాస్ మూవీ దేశవ్యాప్తంగా ఈ రేంజ్‌లో సత్తా చాటుతుందంటే..సరైన కథా, కథనాలతో ఓ మాస్ బొమ్మ పడితే డార్లింగ్ కలెక్షన్ల సునామీ ఊహించడమే కష్టంగా ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో ‘సాహో’ ప్రభాస్ అనాల్సిందే.