Saaho Movie: ప్రభాస్ క్రేజ్‌కు ట్విట్టర్ దాసోహం.. ‘సాహో’కు అరుదైన ఘనత!

యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. సాహో మూవీ కోసం ట్విట్టర్ సంస్థ ప్రత్యేక ఎమోజీని తయారు చేసింది. సాహోలో ప్రభాస్‌కు చెందిన ఓ లుక్‌తో ఈ ఎమోజీని తయారు చేశారు ట్విట్టర్ నిర్వాహకులు. ఇప్పటినుంచి సాహో పేరు మీద […]

Saaho Movie: ప్రభాస్ క్రేజ్‌కు ట్విట్టర్ దాసోహం.. 'సాహో'కు అరుదైన ఘనత!
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 23, 2019 | 5:23 PM

యంగ్ రెబల్ ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ విడుదలకు ముందే పలు రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ తాజాగా మరో ఘనతను ఖాతాలో వేసుకుంది. సాహో మూవీ కోసం ట్విట్టర్ సంస్థ ప్రత్యేక ఎమోజీని తయారు చేసింది. సాహోలో ప్రభాస్‌కు చెందిన ఓ లుక్‌తో ఈ ఎమోజీని తయారు చేశారు ట్విట్టర్ నిర్వాహకులు. ఇప్పటినుంచి సాహో పేరు మీద వేసే ప్రతి హ్యాష్‌ట్యాగ్‌కు స్పెషల్ ఎమోజీ రానుండగా.. ఆగష్టు 31వరకు ఈ స్పెషల్ ఎమోజీ యాక్టివ్‌గా ఉండనుంది. కాగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న మొదటి తెలుగు చిత్రంగా ప్రభాస్ చిత్రం సాహో నిలిచింది. ఇంతవరకు పలు హిందీ, తమిళ్ చిత్రాలకు ట్విట్టర్ ఎమోజీని క్రియేట్ చేసింది.

కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, చుంకీ పాండే, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలో కనిపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుండగా.. అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?