Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

Saaho: సాహో ‘బ్యాడ్ బాయ్’.. జేమ్స్ బాండ్‌కు తక్కువేం కాదే!

Saaho Bad Boy New Song Released, Saaho: సాహో ‘బ్యాడ్ బాయ్’.. జేమ్స్ బాండ్‌కు తక్కువేం కాదే!

రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ నెల 30న విడుదల అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రచారం జోరు పెంచింది. ‘సాహో’ నుంచి బ్యాడ్ బాయ్ అనే ఓ గ్లామరస్ సాంగ్‌ని విడుదల చేశారు. ప్రభాస్, జాక్విలిన్ పెర్నాండెజ్ మధ్య హాట్ హాట్ సెక్సీ స్టెప్స్‌తో సాగిన ఈ సాంగ్ కుర్రకారును కాక రేకెత్తించేలా ఉంది.

మరోవైపు ఈ సాంగ్ ట్రైలర్ చూస్తుంటే.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాలు గుర్తుకు రావడం ఖాయం. మాచో లుక్స్‌లో ప్రభాస్ ‘జేమ్స్ బాండ్’లా కనిపిస్తుంటే.. జాక్విలిన్ పొట్టి పొట్టి బట్టల్లో ఫ్యాన్స్‌లో సెగలు రేపుతోంది. అటు యూట్యూబ్‌లో విడుదలైన కొద్ది గంటల్లోనే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, వెన్నెల కిషోర్, ఎవిలిన్ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.