Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు

Are these the reasons for Prabhas movie collections, Saaho: ‘సాహో’కు సరిలేరు.. ‘లయన్ కింగ్’ బేజారు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ వద్ద తన గర్జనను చూపిస్తున్నాడు ప్రభాస్. అంతేకాదు నాలుగు రోజుల్లో 41మిలియన్ డాలర్లను సంపాదించిన సాహో.. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీల లిస్ట్‌లో రెండో స్థానంలో నిలిచింది.

కాగా విడుదల రోజు నుంచి ఈ మూవీకి అన్ని భాషల్లోనూ ఫ్లాప్ టాక్ వినిపించింది. సినిమాను చూసిన పలువురు క్రిటిక్‌లు ‘‘అబ్బే.. ఇదేమి సాహో’’ అంటూ పెదవి విరిచారు. అయితే కలెక్షన్లు అందుకు భిన్నంగా ఉన్నాయి. క్రిటిక్స్ రివ్యూను ఏ మాత్రం పట్టించుకోని ఆడియెన్స్ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని సాహో మెప్పించడంతో వారు ఈ సినిమాకు మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీంతో అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కావడం.. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ క్రేజ్‌ అమాంతం పెరిగిపోవడం కూడా ‘సాహో’ కలెక్షన్లపై ప్రభావం చూపిందన్నది వారి మాట. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో మొదటి నాలుగు రోజులకు గానూ ముందుగానే ప్రీ బుకింగ్‌లు భారీగానే అయ్యాి. అందుకే మొదటి నాలుగు రోజుల్లో కలెక్షన్లు వస్తున్నాయన్నది కూడా టాక్. ఏది ఏమైనా.. టాక్ ఎలా ఉన్నా.. సాహో కలెక్షన్లు మాత్రం నిర్మాతలను కాస్త ఊరట కలిగించేవే.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటించగా.. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, చుంకీ పాండే, మురళీ శర్మ, వెన్నెల కిశోర్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రానికి గిబ్రాన్ నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Related Tags