సంస్కరణలకు రష్యన్ల బ్రహ్మరథం.. అధ్యక్షుడు పుతిన్ కి దీర్ఘకాల పదవీ యోగం

రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెచ్చిన రాజ్యాంగ సంస్కరణలకు బ్రహ్మరథం పట్టారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేశారు. దీన్ని బట్టి తమ నేత 2036 వరకు పదవిలో..

సంస్కరణలకు రష్యన్ల బ్రహ్మరథం.. అధ్యక్షుడు పుతిన్ కి దీర్ఘకాల పదవీ యోగం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2020 | 3:19 PM

రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెచ్చిన రాజ్యాంగ సంస్కరణలకు బ్రహ్మరథం పట్టారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేశారు. దీన్ని బట్టి తమ నేత 2036 వరకు పదవిలో కొనసాగుతారని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. ఏడు రోజులుగా జరిగిన ఓటింగ్ లో 60 శాతం బ్యాలెట్లను లెక్కించాక.. 76. 9 శాతం మంది ఓటర్లు పుతిన్ సంస్కరణలను ఆమోదించారని అక్కడి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. పుతిన్ ఈ ఏడాది ఆరంభంలో తమ రాజ్యాంగ సంస్కరణలను ప్రకటించారు, గ్యాంరంటీగా మినిమమ్ పెన్షన్లు, గే వివాహాల నిషేధం వంటివి వీటిలో ఉన్నాయి. ఈ సంస్కరణలను ఖఛ్చితంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత ఆయన ఆరేళ్ళ పదవీ కాలపరిమితి 2024 తో ముగియనుంది. కానీ మరో పన్నెండేళ్ల పాటు ఆయన పదవికి ఢోకా ఉండదని అంటున్నారు. అటు-ఈ ఎన్నికల ఫలితాలన్నీ పెద్ద అబధ్ధాలని, అసలైన ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించడం లేదని క్రెమ్లిన్ టాప్ క్రిటిక్ అలెక్సీ నెవేల్నీ పెదవి విరిచారు. ఆయన 2000 సంవత్సరం నుంచి అధ్యక్షుడిగానో, ప్రధాని గానో పదవిలో ఉంటున్నారని, జీవితాతం ప్రెసిడెంట్ గా ఉండాలన్నదే ఆయన ధ్యేయమని అలెక్సీ విమర్శించారు. ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని  కోరిన ఆయన.. ‘ఇదంతా ప్లాన్  జరిగిన ‘షో’ అని అభివర్ణించారు.

ఓటింగ్ ను ప్రోత్సహించేందుకు పుతిన్ ప్రభుత్వం దాదాపు వారం రోజులపాటు ఈ ప్రక్రియను పొడిగించడం విశేషం. పోలింగ్ చివరి రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించడమే గాక.. ఓటర్లకు అపార్ట్ మెంట్లు, కార్లు, నగదు కూడా ‘నజరానా’ గా ఇస్తోంది. మన దేశ భవిష్యత్ సుస్థిరత, భద్రత, ఆభివృద్ది అన్నదే తన లక్ష్యమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఓటు వేయాలని పుతిన్ కోరారు. బుధవారం ఆయన ఓ పోలింగ్ కేంద్రంలో ముఖానికి మాస్క్ లేకుండా ఓటు వేస్తున్న దృశ్యాన్ని ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.

బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
బాసర IIITలో మరో విద్యార్థి‌ సూసైడ్‌.. అసలేం జరుగుతోందక్కడ?
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిందన్నారు.. కట్ చేస్తే.. ఎంక్వయిరీతో.!
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
హైదరాబాదీలకు అలర్ట్‌.. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సుల కోసం చూస్తున్నారా
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
పాపం ఇరుకున్న స్వప్న.. వెన్నెల కోసం టెన్షన్‌గా ఎదురు చూపులు..
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
తిరుమల వెళ్లేవారికి ముఖ్య అలెర్ట్.. ఈ విషయం మీకు తెలుసా.?
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ