వచ్చేవారం పెద్దఎత్తున కరోనా వ్యాక్సినేషన్.. తొలి టీకా తానే తీసుకుంటానని ప్రకటించిన పుతిన్

బ్రిటన్‌ బాటలోనే రష్యా పయనిస్తోంది. వచ్చేవారం నుంచి రష్యాలో ప్రజలకి కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. వచ్చేవారం ఆఖరునుంచి ఈ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని ఆయనే స్వయంగా ప్రకటించారు....

వచ్చేవారం పెద్దఎత్తున కరోనా వ్యాక్సినేషన్.. తొలి టీకా తానే తీసుకుంటానని ప్రకటించిన పుతిన్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 9:24 PM

బ్రిటన్‌ బాటలోనే రష్యా పయనిస్తోంది. వచ్చేవారం నుంచి రష్యాలో ప్రజలకి కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. వచ్చేవారం ఆఖరునుంచి ఈ వ్యాక్సినేషన్‌ మొదలవుతుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. వాస్తవానికి కరోనా వైరస్‌కు తొలి టీకా తామే కనుగొన్నట్లు ఆగస్ట్‌లో పుతిన్‌ ప్రకటించారు. స్ఫుత్నిక్‌-వి అని పేరుపెట్టారు. అయితే అప్పట్లో అది రెండోదశ ప్రయోగంగానే ఉంది. పైజర్‌ వ్యాక్సిన్‌ను తమ దేశ ప్రజలకు ఇస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించిన కొద్దిగంటల్లోనే పుతిన్‌ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

పుతిన్‌ ఆదేశాల మేరకు 20 లక్షల స్ఫుత్నిక్‌- వి డోసులను రష్యా రెడీ చేస్తోంది. రష్యా డాక్టర్లకు, టీచర్లకు తొలివిడతలో రెండు డోసులు ఇస్తారు. “నాకేం చెప్పకండి. వచ్చేవారం పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టండి” అంటూ ట్విట్టర్ వేదికగా పుతిన్‌ ఆదేశాలు జారీచేశారు.

స్ఫుత్నిక్‌- వి వ్యాక్సిన్‌పై పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. తొలి విడతలో 22వేల మందికి, రెండో విడతలో 19వేల మందికి, మూడో విడతలో 40వేల మంది వలంటీర్లకు స్ఫుత్నిక్‌-వి టీకాలను ఇంజెక్షన్‌ ద్వారా ఇచ్చారు. మూడో విడత ప్రయోగాల్లో ఈ టీకా సమర్థత 91.4 శాతంగా ఉందని రష్యా అధికారులు చెప్పారు. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ తమదే కావాలని రష్యా అధినేత పుతిన్‌ కలలుగన్నారు. కానీ బ్రిటన్‌ నుంచి ప్రకటన వచ్చేసింది. దీంతో పుతిన్‌ ఇజ్జత్‌ కా సవాల్‌ అనుకున్నారు.

ఒకవైపు రష్యాలో ఒక్కరోజులో 25, 345 కరోనా కేసులు రిజిస్టర్‌ అయ్యాయి. 24 గంటల్లో 589 మంది చనిపోయారు. కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్న పరిస్థితుల్లో స్ఫుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ప్రయోగం ఎలా ఉంటుంది? వికటిస్తుందా? విజయవంతం అవుతుందా? కాలం కరిగిపోతోంది. రష్యానేకాదు, రష్యా వ్యాక్సిన్‌ మీద ఆధారపడిన పలు దేశాలను వ్యాక్సిన్‌ టెన్షన్‌ పెడుతోంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..