ఇద్దరు బల్గేరియన్ దౌత్యాధికారుల బహిష్కరణ, రష్యా ప్రతీకారం

బల్గేరియాపై రష్యా ప్రతీకారం తీర్చుకుంది. ఇద్దరు బల్గేరియన్ దౌత్యాధికారులను బహిష్కరించింది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణపై ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బల్గేరియన్ ప్రభుత్వం బహిష్కరించడంతో రష్యా సైతం ఇలాంటి చర్యే తీసుకుంది. 2016 నుంచి తమ సైన్యానికి సంబంధించిన రహస్యాలను ఇద్దరు రష్యా డిప్లొమాట్స్ సేకరించి వారి దేశానికి పంపుతున్నారని బల్గేరియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. మిలిటరీ మోడరనైజేషన్ ప్లాన్స్ కు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని వారు సేకరించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణను […]

ఇద్దరు బల్గేరియన్ దౌత్యాధికారుల బహిష్కరణ, రష్యా ప్రతీకారం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 6:45 PM

బల్గేరియాపై రష్యా ప్రతీకారం తీర్చుకుంది. ఇద్దరు బల్గేరియన్ దౌత్యాధికారులను బహిష్కరించింది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న ఆరోపణపై ఇద్దరు రష్యన్ దౌత్యవేత్తలను బల్గేరియన్ ప్రభుత్వం బహిష్కరించడంతో రష్యా సైతం ఇలాంటి చర్యే తీసుకుంది. 2016 నుంచి తమ సైన్యానికి సంబంధించిన రహస్యాలను ఇద్దరు రష్యా డిప్లొమాట్స్ సేకరించి వారి దేశానికి పంపుతున్నారని బల్గేరియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. మిలిటరీ మోడరనైజేషన్ ప్లాన్స్ కు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని వారు సేకరించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణను రష్యా ఖండించింది. ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్నాయి.