రష్యా నుంచి మరో టీకా.. మొదలైన క్లినికల్‌ ట్రయల్స్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ డ్రగ్స్ కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయి. కొన్ని దేశాల్లో మనుషులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌లో తొలి దశ, రెండో దశల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయి.

రష్యా నుంచి మరో టీకా.. మొదలైన క్లినికల్‌ ట్రయల్స్‌
Follow us

|

Updated on: Sep 30, 2020 | 9:53 PM

చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన మాయదారి కరోనా వైరస్… ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఇప్పటివరకూ కరోనా కట్టడికి వ్యాక్సిన్ గానీ, ఔషధం గానీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ డ్రగ్స్ కంపెనీలు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుపుతున్నాయి. కొన్ని దేశాల్లో మనుషులపై నిర్వహిస్తున్న వ్యాక్సిన్ ట్రయల్స్‌లో తొలి దశ, రెండో దశల్లో సత్ఫలితాలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే మొదటి కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేసిన రష్యా రెండో టీకాను కూడా నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. సైబీరియాకు చెందిన వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన రెండో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇటీవల పూర్తిచేసిందని ఆర్‌ఐఏ వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది. వెక్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫేస్‌ 2 క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు పేర్కొంది.

వెక్టర్ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన ఎపివాక్ కరోనాగా పిలుస్తున్న మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 లోగా రిజిస్టర్‌ చేస్తామని నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్త్‌ వాచ్‌డాగ్ ఇటీవల ప్రకటించింది. కాగా, రష్యా మొదట రిజిస్టర్‌ చేసిన వ్యాక్సిన్‌ పేరు స్పుత్నిక్‌ వీ. దీన్ని ఆగస్టు 11న నమోదు చేసింది. గతంలోనే తమ దేశంలో రెండో కొవిడ్‌ టీకాను రిజిస్టర్‌ చేయబోతున్నామని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా ఎగువ సభలో ప్రకటన చేశారు. అలాగే, కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశ సామర్థ్యాన్ని పుతిన్ అభినందించారు. కొవిడ్‌-19 ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!