Breaking News
  • ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని నడపలేం-సీఎం కేసీఆర్‌. ఆర్టీసీకి ఇప్పటికే రూ.5 వేల కోట్ల అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు దాదాపు రూ.2 వేల కోట్లు. ప్రస్తుతం ఆర్టీసీని నడపాలంటే నెలకు రూ.640 కోట్లు కావాలి. ఆర్టీసీకి ఆర్థిక భారం మోసే శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. ఆర్టీసీకి ఉన్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదు. హైకోర్టు తీర్పు తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం-కేసీఆర్‌
  • హైదరాబాద్‌: నేడు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ. హైకోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికుల్లో ఉత్కంఠ
  • చంద్రయాన్‌-2 ప్రయోగం విఫలమైందనడం సమంజసం కాదు. ఇలాంటి ప్రయోగాల్లో చిన్న సమస్యలు తలెత్తే అవకాశం సాధారణం. అంతమాత్రాన చంద్రయాన్‌-2 విఫలమైందనడం సరికాదు -కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌
  • ఎస్‌పీజీ సెక్యూరిటీ ఉపసంహరణపై ప్రియాంకాగాంధీ స్పందన. రాజకీయాల్లో భాగంగానే సెక్యూరిటీ తొలగించారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉంటాయి-ప్రియాంక
  • తాజ్‌మహల్‌ పరిసరాల్లో డ్రోన్లు ఎగరేసిన విదేశీ యాత్రికులు. రష్యాకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దేశంలో ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనేందుకు.. పెట్టుబడుల ఉపసంహరణ సరైన పరిష్కారం కాదు-మమతాబెనర్జీ. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం తాత్కాలిక ఉపశమనమే. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి దోహదం చేయవు-మమత
  • సియాచిన్‌పై పాకిస్తాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు. సియాచిన్‌ వివాదాస్పద ప్రాంతం. అలాంటి ప్రాంతంలో భారత్‌ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుంది. భారత్‌ నుంచి ఎలాంటి మంచిని ఆశించడంలేదన్న పాక్‌
  • ఈశాన్య రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు. గౌహతి, షిల్లాంగ్‌లో కంపించిన భూమి. భయంతో ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

‘ఆర్టీఐ ‘ బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం

RTI officer slams trs, ‘ఆర్టీఐ ‘ బిల్లు.. మూడు పార్టీలపై మాజీ సీఐసీ ఆగ్రహం

ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్, వైసీపీ, బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు తెలపడంపట్ల మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఈ పార్టీలకు ఓ లేఖ రాస్తూ.. అసలు ఈ సవరణ బిల్లును మీరుగానీ, మీ ఎంపీలుగానీ చదివారా అని ప్రశ్నించారు. లోక్ సభలో ఈ బిల్లు ఇటీవల ఆమోదం పొందగా,, రాజ్యసభ గురువారం ఆమోదించింది. రాజ్యసభనుంచి కాంగ్రెస్, ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశాయి. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ఈ పార్టీల సభ్యులు కోరగా.. అందుకు ప్రభుత్వం నిరాకరించి ఓటింగ్ కు పెట్టింది. ఓటింగులో బిల్లుకు అనుకూలంగా 117 మంది, వ్యతిరేకంగా 75 మంది ఓటు చేయడంతో దీన్ని సభ ఆమోదించింది. అలాగే లోక్ సభలో అంతకుముందు ఈ బిల్లుకు అనుకూలంగా 218 మంది, ప్రతికూలంగా 79 మంది సభ్యులు ఓటు చేశారు. (దాంతో లోక్ సభ ఆమోదం కూడా దీనికి లభించింది). ఈ సవరణ బిల్లు వల్ల కలిగే కొత్త సమస్యలను మీరు గుర్తించ లేదని శ్రీధరాచార్యులు తన లేఖలో తెరాస, వైసీపీ, బీజేడీ నేతలను విమర్శించారు. మీరంతా ప్రజా సంక్షేమానికి పాటు పడే నాయకులని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎన్నో త్యాగాలు చేశారని సెటైర్ వేసిన ఆయన.. అయితే ఈ బిల్లులోని కొన్ని అంశాల విషయంలో మొదట మీరు న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవలసి ఉండిందని పేర్కొన్నారు. ఇందులోని అంశాలు రాష్ట్రాల అధికారాలను హరించేవిగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
బిల్లులోని సెక్షన్ 4 (1) సీ వంటివి మోరల్ గా, లీగల్ గా, రాజ్యాంగపరంగా, రాజకీయంగా కూడా వివిధ రాష్ట్రాల హక్కులను నీరుగార్చేవిగా ఉన్న విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ఈ చర్య . అధికార ‘ కేంద్రీకృతం ‘గా ఉందని, ,ఇన్ఫర్మేషన్ కమిషనర్ల జీతాలు, ఇతర ప్రయోజనాల కల్పనలో కేంద్రానికే అధికారాలను కట్టబెడుతూ ఈ సవరణబిల్లులో నిర్దేశించారని ఆయన అన్నారు. . అటు- ప్రతిపక్షాల సభ్యులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీఐ చట్టానికి ఇది గండి కొడుతోందని, ప్రభుత్వం సీఐసి హక్కులను అణచి వేస్తోందని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఇటీవల లోక్ సభలో తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.