ఆర్టీసీలో పెరిగిన టికెట్ రేట్లు.. వివరాలు తెలుసుకున్నారా..?

సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఆర్గీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఉదయాన్నే డిపోల వద్దకు కోలాహలం ప్రారంభమైంది. ఎటువంటి షరతలు లేకుండానే తిరిగి ఉద్యోగాల్లో తీసుకుండటంతో  ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు. 52 రోజుల తర్వాత టీఎస్ ఆర్జీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని పలువురు ఉద్యోగులు స్వాగతించారు. తెలంగాణవ్యాప్తంగా కార్మికులు షిఫ్ట్‌లవారీగా డ్యూటీలో చేరుతున్నారు. ఇకపోతే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు చార్జీల ధరలను […]

ఆర్టీసీలో పెరిగిన టికెట్ రేట్లు.. వివరాలు తెలుసుకున్నారా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 29, 2019 | 11:20 AM

సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఆర్గీసీ కార్మికులు విధుల్లో చేరుతున్నారు. ఉదయాన్నే డిపోల వద్దకు కోలాహలం ప్రారంభమైంది. ఎటువంటి షరతలు లేకుండానే తిరిగి ఉద్యోగాల్లో తీసుకుండటంతో  ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తోన్నారు. 52 రోజుల తర్వాత టీఎస్ ఆర్జీసీ కార్మికుల సమ్మెకు తెరపడింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని పలువురు ఉద్యోగులు స్వాగతించారు. తెలంగాణవ్యాప్తంగా కార్మికులు షిఫ్ట్‌లవారీగా డ్యూటీలో చేరుతున్నారు. ఇకపోతే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు చార్జీల ధరలను పెంచబోతున్నట్టు స్పష్టం చేసింది. కిలో మీటర్‌కు 20 పైసలు చొప్పున చార్జీలు పెరగనున్నాయి. పెంచిన ధరలు డిసెంబర్ 2వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెంపు వల్ల ఆర్టీసీకి ఏడాదికి సుమారు రూ.752 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. కాగా చార్జీలు పెంచడం వల్ల హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు వెళ్లేవారికి అదనంగా ఎంత భారం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ నుంచి విజయవాడ సుమారు రూ.53,  హైదరాబాద్  నుంచి  ఖమ్మం సుమారు రూ.40, హైదరాబాద్ నుంచి వరంగల్ సుమారు రూ.30, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం సుమారు రూ.125, హైదరాబాద్  నుంచి ఒంగోలు సుమారు రూ.65.