దసరాకు ఊరెళ్లిన వారికి కొత్త టెన్షన్.. కేసీఆర్ డెసిషన్‌తో షాక్

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ ఐదో రోజుకు చేరింది. కొన్ని చోట్ల బంద్ పాక్షికంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం డిపోలో నుంచి బస్‌లు కదలడం లేదు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దసరా సందర్భంగా ఊరికి వెళ్లిన వారు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలే పండుగ సీజన్లో సొంత ఊళ్లకు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు చెల్లించి వెళ్లిన వారు.. అక్కడి నుంచి వచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక హైదరాబాద్ […]

దసరాకు ఊరెళ్లిన వారికి కొత్త టెన్షన్.. కేసీఆర్ డెసిషన్‌తో షాక్
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 09, 2019 | 7:00 PM

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ ఐదో రోజుకు చేరింది. కొన్ని చోట్ల బంద్ పాక్షికంగా ఉన్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో మాత్రం డిపోలో నుంచి బస్‌లు కదలడం లేదు. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దసరా సందర్భంగా ఊరికి వెళ్లిన వారు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అసలే పండుగ సీజన్లో సొంత ఊళ్లకు డబుల్, ట్రిపుల్ ఛార్జీలు చెల్లించి వెళ్లిన వారు.. అక్కడి నుంచి వచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక హైదరాబాద్ వంటి సిటీల్లో కూడా ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బస్ పాస్‌లు కూడా చెల్లవని చెబుతుండటంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు పండుగ సీజన్‌లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలుగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయడంలో ప్రభుత్వం విఫలైమంది. దీంతో ఇటు ప్రభుత్వం.. అటు ఆర్టీసీపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే విధులకు హాజరుకానీ వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించినా.. కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఏం చెయ్యాలనే అంశంపై ఇవాళ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయి వాస్తవ పరిస్థితిని వివరించనున్నారు.వాళ్లు చెప్పే దాన్ని బట్టి తదుపరిగా ఎలా అడుగులు వేయాలని అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇవాళ సమావేశం కానున్నారు. ఆ తరువాత ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఆర్టీసీతో పాటు అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. మరోవైపు బుధవారమే అన్ని జిల్లాల్లో కూడా రాజకీయ నాయకులతో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు. కాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఈ సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలికాయి. వీటితో పాటు ఏపీ ఆర్టీసీ కార్మికుల యూనియన్‌ కూడా సమ్మెకు తమ సపోర్ట్‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇటు ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం.. అటు ఆర్టీసీ కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!