Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లలో తీరేవెన్ని..? ప్రభుత్వం తీర్చేవెన్ని..? ఇవే ఆ డిమాండ్ల లిస్ట్..!

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె సద్దు మణిగే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే అవునని అంటున్నాయి. డిమాండ్ల అంగీకారంపైనే సమ్మె సద్దు మణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆర్టీసీ డిమాండ్లేంటి? వాటిలో సాధ్యమయ్యేవెన్ని? సాధ్యం కాకపోవడానికి అవకాశం ఉన్నవెన్ని? మొదట సమ్మెకు వెళ్లేముందు TMU 42 డిమాండ్లను కార్పొరేషన్ ముందుంచింది. ఆ తర్వాత కార్మిక సంఘాలన్ని జేఏసీగా ఏర్పడి డిమాండ్లను కుదించి 26కు తగ్గించాయి. అందులో ప్రధానమైనది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇక మిగతా 25 డిమాండ్లలో 21 ఆర్థికంగా పెద్దగా భారం లేకుండానే తీర్చేదిగా కోర్టు సూచించింది.

1. హైకోర్టు సూచించిన కార్మికుల డిమాండ్లు పరిశీలిస్తే.. కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను నియమించాలి.

2. డ్రైవర్లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి, గతంలో కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోవాలి. ఉద్యోగ భద్రత అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా చూడమనే. ఈ డిమాండ్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో లింక్ అయి ఉంది.

3. తార్నాక ఆస్పత్రిలో మందుల కొరత వైద్యానికి చాలెంజింగ్‌గా మారింది. డిస్పెన్సరీల నుంచి అవసరమైనన్ని మందులు సరఫరా చేయాలి. ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

4. తార్నాక ఆసుపత్రిలో డాక్టర్లను పెంచడంతోపాటు, తగిన సంఖ్యలో పారామెడికల్ సిబ్బందిని డిస్పెన్సరీల వద్ద నియమించాలి. ఇది ఆరోగ్య శాఖతో ముడిపడి ఉన్న ఆంశం. ఆ శాఖను సంప్రదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం కోరే అవకాశం ఉంది. సిబ్బందిని పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చే అవకాశం ఉంది.

5. పెండింగ్‌లో ఉన్న మెడికల్ రియంబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే మంజూరు చేయాలి. ఎలాంటి కోత లేకుండా చెల్లింపులు జరగాలి. ఇది సాధ్యమైన డిమాండే. కాకపోతే ప్రభుత్వం ఇప్పటికిప్పుడు కాకుండా కొంత కాలం తర్వాత పెండింగ్ బిల్లులు పూర్తి చేస్తామని చెప్పవచ్చు.

6. ఆర్టీసీ ఆసుపత్రి కాకుండా వేరే ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా.. రియంబర్స్‌ చేయాలి. కార్మికులు అడుగుతున్నట్లు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం జరిగినట్లే. లేదా కార్పొరేషన్ నుంచి రెఫరల్ హాస్పిటల్ లకు చెల్లించాల్సిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశం కూడా ఉంది.

7. మెడికల్ ఖర్చుల కోసం PF WITHDRAWAL చేసుకునే అవకాశాన్ని వెంటనే కల్పించాలి. కార్పొరేషన్ చెల్లించాల్సిన పిఎఫ్ పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉంది. ఇది ఆర్థికపరమైన అంశం.

8. చాలా కాలంగా స్పేర్ పార్ట్స్, టూల్స్ సరఫరా చేయడం లేదు. రెగ్యులర్‌గా సరఫరా జరిగేలా చూడాలన్నది కార్మికుల డిమాండ్. దీని పట్ల కార్పొరేషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

9. ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చి డిపోలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కార్మికులను శాశ్వత ప్రాతిపదికన తీసుకోవడం ద్వారా కార్పొరేషన్ కు ఎంత భారం పడుతుందనే అంశం ప్రభుత్వం పరిశీలినలో ఉంది.

10. డ్రైవర్, కండక్టర్ లకు యూనిఫాం కోసం డబ్బులు చెల్లించాలి. ఈ డిమాండ్‌ను ఆర్టీసీ కార్పొరేషన్ ఒప్పుకునే అవకాశం ఉంది.

11. ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డ్, ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలి. ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఇప్పటికే కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా ఆసుపత్రి డిస్పెన్సరీలు ఉన్నాయి. కాబట్టి వాటిని బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది.

12. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ అమలు చేయాలి. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంది.

13. గతంలో హామీ ఇచ్చినట్లు సిస్టం సూపర్‌ వైజర్‌ designation మార్చాలి. కార్పొరేషన్ ఈ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

14. ఉద్యోగులకు సంబంధించిన SBT, SRBS, PF విభజన ఇంకా జరగలేదు. వెంటనే విభజించాలి. వాస్తవానికి APSRTC విభజన ఇంకా పూర్తికాలేదు. కార్పొరేషన్ విభజన ప్రక్రియలో భాగంగా ఇది జరిగే అవకాశం ఉంది.

15. కండక్టర్లకు పరీక్ష నిర్వహించి జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోట్‌ చేసేందుకు ఇప్పటికే ఎగ్జామ్‌ నిర్వహించారు. సెలక్ట్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వాలి. ఇప్పటికే చెల్లిస్తున్న జీతాలు కార్పొరేషన్‌కు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో కొత్త పోస్టుల ప్రతిపాదన అంటే కష్టమే.

16. అన్ని డిపోల్లో మహిళలకు రెస్ట్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ప్రెగ్నెన్సీకి 6 నెలల లీవ్‌ ఇస్తూ ODగా పరిగణించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా సౌకర్యాలు అడుగుతున్న ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మహిళా కండక్టర్లకు రాత్రి పూట డ్యూటీ వేయకూడదు. రాత్రి 9 గంటలలోపే విధులు ముగిసేలా.. డ్యూటీ వేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది.

17. సిటీ రూట్లలో రూట్ సర్వే నిర్వహించి రూట్లను ఖరారు చేయాలి. ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

18. సిటీ డిపోలకు సంబంధించిన అవసరాల కోసం ప్రత్యేకంగా స్టోర్లను ఏర్పాటు చేయాలి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తూ.. ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వవచ్చు.

19. కార్మికుల పిల్లలకు ఐటిఐ ట్రైనింగ్ ఇవ్వాలి. అర్హత కలిగిన వారికి కార్పొరేషన్ లోకి ఉద్యోగమివ్వాలి. ఆర్టీసీలో కొత్త నియామకాలకు అవకాశాలు ఉన్నట్లు కనిపించడం లేదు.

20. గ్యారేజ్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి VOLVO, స్పెషల్ బస్సులకు నియమించాలి. వాస్తవానికి VOLVO, స్పెషల్ బస్సులు అద్దె నుంచి తీసుకున్నవే ఎక్కువ. కాబట్టి దీనిపై ఆర్.టి.సి సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువే.