డిమాండ్లపై తగ్గని ఆర్టీసీ జేఏసీ.. ప్రభుత్వంతో చర్చలు విఫలం!

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈడీ సభ్యుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్&బీ భవనంలో ఈ చర్చలు జరగ్గా… దీనికి ఆర్టీసీ జేఏసీ తరపున అశ్వత్థామరెడ్డి,రాజిరెడ్డి,వీఎస్ రావు,వాసుదేవరావులను మాత్రమే అనుమతించారు. మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని అశ్వత్థామరెడ్డి కోరగా.. 21 డిమాండ్లపైనే ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక […]

డిమాండ్లపై తగ్గని ఆర్టీసీ జేఏసీ.. ప్రభుత్వంతో చర్చలు విఫలం!
Follow us

|

Updated on: Oct 27, 2019 | 2:06 PM

తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈడీ సభ్యుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఆర్&బీ భవనంలో ఈ చర్చలు జరగ్గా… దీనికి ఆర్టీసీ జేఏసీ తరపున అశ్వత్థామరెడ్డి,రాజిరెడ్డి,వీఎస్ రావు,వాసుదేవరావులను మాత్రమే అనుమతించారు. మొత్తం 46 డిమాండ్లపై చర్చలు జరపాలని అశ్వత్థామరెడ్డి కోరగా.. 21 డిమాండ్లపైనే ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశాన్ని మొత్తం వీడియో తీసిన ప్రభుత్వం.. ఆ సీడీని కోర్టుకు సమర్పించనుంది.

ఇవి నిర్బంధ చర్చలు – అశ్వత్థామరెడ్డి

చర్చలని పిలిచి మా ఫోన్లు లాక్కున్నారు. 21 అంశాలపై యాజమాన్యం చర్చిస్తామని చెప్పారు. కానీ మేము 26 అంశాలపై చర్చలు జరిపాలని కోరాం. యాజమాన్యం ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని మమ్మల్ని చర్చలకు పిలిచారు. మా వాళ్ళతో లోపల జరిగిన అంశాలపై చర్చిస్తాం. మళ్ళీ ఒకవేళ చర్చలకు ఆహ్వానిస్తే కూడా సిద్ధంగా ఉన్నాం. అప్పటివరకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కోర్టు కోసమే చర్చలకు పిలిచినట్లు ఉందని.. శత్రుదేశాలతో కూడా ఇటువంటి చర్చలు ఎప్పుడూ జరగలేదని మరో కన్వీనర్ వీఎస్ రావు అన్నారు.