బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి

RTC Bus Hits The Bike. One Person Died, బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పొగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాదాద్రి భువనగిరి శివారు మాసకుంట గ్రామ సమీపంలో హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై తొర్రూర్  డిపోకు చెందిన ఆర్టీసీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కొల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి తలకు హెల్మెట్‌ ఉండటం వల్లనే బ్రతికినట్లుగా స్థానికులు చెప్పారు. మృతుడు రంగారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *