మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్..

ఆర్టీసీ బస్సును నడిపే కొందరు డ్రైవర్లు అదుపు తప్పుతున్నారు. స్టడీగా, స్టేబుల్ గా ఉండాల్సిన డ్రైవర్లు మత్తులో జోగుతున్నారు. తాగి, తుళ్లుతూ మరీ బస్సు నడిపిస్తూ ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ డ్రైవర్ మందు తాగి బస్సు నడుపుతున్నాడని ప్రయాణికులు ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది.

భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం తాగి విధుల్లోకి వచ్చాడు. బస్సు నడుపుతుండగా అటు ఇటు అదుపు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కండక్టర్‌ను నిలదీయడంతో బస్సును మధ్యలోనే ఆపేశారు. డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *