గుట్కా నమిలిన డ్రైవర్… బస్సు బోల్తా

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లాలో బస్సు బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తూనే స్టీరింగ్ వదిలి… గుట్కా ప్యాకెట్ చింపి నోట్లో వేసుకోవడంతో వాహనం అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఆరుగురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. బస్సుకు చెట్టు కొమ్మలు అడ్డుగా నిలవడంతో ప్రాణ నష్టం తప్పినట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 63 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను మంథని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కరీంనగర్ జిల్లా అడవిసోమన్ పల్లి బ్రిడ్జి దగ్గర బుధవారం (మే 15) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *