శ్రీశైల దేవస్థానంలో భారీ స్కాం.. రూ.56 లక్షలు గోల్ మాల్

ధ‌నార్జ‌నే ధ్యేయంగా కొంద‌రు అక్ర‌మార్కులు అవినీతి కార్య‌క‌లాపాలు య‌ద్ధేచ్చ‌గ్గా సాగిస్తుంటారు. సామాన్యులు మొద‌లు అవ‌స‌ర‌మైతే ఆ దేవుళ్ల‌ను కూడా నిలువునా ముంచేస్తుంటారు. ఇదే త‌హార‌లో కొంద‌రు శ్రీశైలంలో కొలువుదీరిన ముక్కంటిశుడి...

శ్రీశైల దేవస్థానంలో భారీ స్కాం.. రూ.56 లక్షలు గోల్ మాల్
Follow us

|

Updated on: Apr 17, 2020 | 7:09 AM

ధ‌నార్జ‌నే ధ్యేయంగా కొంద‌రు అక్ర‌మార్కులు అవినీతి కార్య‌క‌లాపాలు య‌ద్ధేచ్చ‌గ్గా సాగిస్తుంటారు. సామాన్యులు మొద‌లు అవ‌స‌ర‌మైతే ఆ దేవుళ్ల‌ను కూడా నిలువునా ముంచేస్తుంటారు. ఇదే త‌హార‌లో కొంద‌రు శ్రీశైలంలో కొలువుదీరిన ముక్కంటిశుడి సొమ్ముపైనే స్వాహా చేసేశాడు. ఒక‌టి కాడు, రెండు కాదు, ఏకంగా రూ. 56ల‌క్ష‌ల సొత్తు కాజేసిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. ఆలస్యంగా గుర్తించిన అధికారులు వారి నుంచి రూ.42 లక్షలు రికవరీ చేశారు. వివరాల్లోకి వెళితే…

శ్రీశైలం దేవస్థానం లో తాజాగా మరో గోల్ మాల్ బయటపడింది. భక్తులు దేవస్థానానికి స‌మ‌ర్పించే విరాళాల కౌంటర్ లో ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రూ. 56 లక్షలు కాజేసినట్లు సమాచారంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. దర్యాప్తు చేసిన అధికార యంత్రాంగం ఎట్టకేలకు అవినీతి తిమింగులాలను బయటికి తీసింది. శ్రీశైల దేవస్థానం లో వరుస అవినీతి, అక్రమాలు బయటపడడం భక్తులను కలవర పరుస్తోంది. ఇటీవల పెట్రోల్ బంక్ లో 41లక్షల అవకతవకలు, అలాగే కంకణాల కౌంటర్లో ఉద్యోగుల చేతి వాటం, తాజాగా భక్తులు దేవస్థానానికి సమర్పించే విరాళాల సేకరణ కౌంటర్ వద్ద ఈ భారీ కుంభ కోణం బయటపడడంతో పెద్ద ఎత్తున దుమారం నెలకొంది.

స్వామివారి విరాళాల‌ గోల్మాల్ కు సంబంధించి దేవస్థానం అధికారులు విచారణ చేపట్టి అవకతవకలు జరిగినట్లు నిర్ధారించుకున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుండి రూ.42లక్షలు రికవరీకూడా చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈఓ.కేస్.రామారావు తెలిపారు. దేవస్థానం నుంచి ఫిర్యాదును కూడా శ్రీశైలం పోలీసులకు ఇచ్చినట్లు పిర్యాదు చేశారు. జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఆల‌య ఈ వో కె ఎస్ రామారావు స్పందిస్తూ అవినీతికి పాల్పడిన వారు ఎవ‌రైనా స‌రే ఉపేక్షించేది లేద‌ని లేదని స్ప‌ష్టం చేశారు.  అవినీతిప‌రులు ఎంతటివారైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. ఇంతటి భారీ స్కాం లో ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులేనా,  లేక ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా ఉన్నారా, అన్న కోణంలో పోలీసులు విచారణ చేయనున్నారు. దీంతో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ఆన్‌లైన్  పద్ధతి ద్వారా టికెట్ల విక్రయం, సర్వర్ గది సాంకేతిక సిబ్బంది చేతిలో అధికారం ఉండటం. కంప్యూటర్ సాఫ్టవేర్ విధానంలో విరాళాలు ,టిక్కెట్ల విక్రయాలు నమోదు అవుతూ ఉండగా, వీటికి సంబంధించిన లెక్కలు సరిగా లేకపోవడాన్ని గమనించిన సాంకేతిక సిబ్బంది ఈ వ్యవహారాన్ని ఉన్నత అధికారులకు తెలిపారు. దీంతో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఈ స్కాం కు సంబంధించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి తక్షణమే తొలగించారు. పోలీసులు ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని తిమింగలాలు బయటపడే అవకాశం ఉంది..