మోసాల పుట్ట అగ్రిగోల్డ్ కథా, కమామీషు ! కథల కథల కుంభకోణం, డొల్ల సంస్థలు, నిధుల మళ్లింపు,..ఒకటా? రెండా ?

ఆరువేల కోట్లకు పుట్టి ముంచిన అగ్రి గోల్డ్ అసలు కథ తెలిస్తే షాక్ తినాల్సిందే ! ఒక్కసారి లోతుల్లోకి వెళ్తే..1996 లో విజయవాడలో పుట్టింది ఈ సంస్థ..

మోసాల పుట్ట అగ్రిగోల్డ్ కథా, కమామీషు ! కథల కథల కుంభకోణం, డొల్ల సంస్థలు, నిధుల మళ్లింపు,..ఒకటా? రెండా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 24, 2020 | 7:50 PM

ఆరువేల కోట్లకు పుట్టి ముంచిన అగ్రి గోల్డ్ అసలు కథ తెలిస్తే షాక్ తినాల్సిందే ! ఒక్కసారి లోతుల్లోకి వెళ్తే..1996 లో విజయవాడలో పుట్టింది ఈ సంస్థ.. చైర్మన్ గా ఎవి  రామారావు పదవి చేపట్టగా సోదరుడు అవ్వాస్ సీతారాం సహకరించారు.కొంతకాలం డిపాజిటర్ల నుంచి సేకరణ వగైరా వ్యవహారం బాగానే సాగింది. అయితే 2014 డిసెంబరులో ఈ సంస్థ కుంభకోణం బయటపడింది. 2002-2014 మధ్యలో 32,02,607 మంది నుంచి డిపాజిట్లు సేకరించగా వీరిలో ఏపీకి చెందినవారు 19,43,120 మంది ఉన్నారు. అప్పటికే ఆర్బీఐ, సెబీ అనుమతులు లేకుండా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలు తలెత్తాయి. రూ .25 వేలు డిపాజిట్ చేస్తే ఆరేళ్లలో రెట్టింపు మొత్తం ఇస్తామన్న ప్రచారంతో చాలామంది డిపాజిట్లు పెట్టేశారు. పైగా అలా వద్దనుకుంటే దానికి బదులు ఓ రెసిడెన్షియల్ ప్లాటు ఇస్తామన్న ఆశ కూడా చూపారు. ఇక మెల్లగా దేశవ్యాప్తంగా ఈ సంస్థ గ్రూపుల్లోకి భారీ ఎత్తున పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైంది. 2002-2014 మధ్య మొత్తం రూ. 6,484 కోట్ల  డిపాజిట్ల సేకరణ జరగగా..ఇందులో 6,400 కోట్లు 2004-2014 మధ్య సేకరించారు.

గోల్డ్ లైన్, గ్రీన్ గైన్, గ్రీన్వే, సిల్వరైన్ ప్రాజెక్టుల పేరిట డిపాజిటర్ల నుంచి వీటిని సేకరించారు. పేరుకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా రూల్స్ కి విరుద్ధంగా ఆర్ బీ ఐ నుంచి గానీ, సెబీ నుంచి గానీ ఎలాంటి అనుమతులు లేకుండానే యవ్వారం సాగింది. ఇక వాగ్దానాల మేరకు  సొమ్ము  చెల్లించడంలో ఫ్లాట్లను రిజిస్టర్ చేయడంలో అగ్రిగోల్డ్ చేతులెత్తేసింది.మెచ్యూరిటీ అనంతరం ఖ్తాతా దారులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతూ వచ్చాయి. దీంతో  దేశ వ్యాప్తంగా బాధితుల ఆందోళనలు, నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కేరళ, అండమాన్ లలో సైతం ఆందోళనలు సాగాయి,

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థపై 16 కేసులు నమోదు కాగా 2015 న అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఐడీ కి కేసును అప్పగించింది. బాధితులను ఆదుకునేందుకు కె.నరసింహ మూర్తి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు కాగా-2016 ఫిబ్రవరిలో చైర్మన్ అవ్వా వెంకట రామారావు,ఎం డీ అవ్వా వెంకట శేషు నారాయణరావును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు . 2018 మే 22 న వైస్ చైర్మన్ అవ్వా సీతారామారావును ఢిల్లీలో అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ పర్యవేక్షణకు హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సూర్యారావు ఆధ్వర్యాన త్రిసభ్య కమిటీ ఏర్పాటయింది. అనారోగ్యానంతో ఆయన మరణించాక ఇదే బాధ్యతతో జస్టిస్ సి. సీతాపతిని నియమించారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 21,642 ఎకరాలను అటాచ్ చేశారు. సూసైడ్ చేసుకున్న వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున టీడీపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే తమకు ఆస్తులు అప్పగించాలని, నాలుగేళ్లలో మొత్తం సొమ్మును చెల్లిస్తామని ఎస్సెల్ గ్రూపు ప్రతిపాదించగా.. దీన్ని ప్రభుత్వం, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం కూడా వ్యతిరేకించడంతో ఎస్సెల్ సంస్థ తప్పుకుంది. హైకోర్టు నియమించిన కమిటీ ద్వారా 2016 ఏప్రిల్ లో ఆస్తుల వేలానికి చర్యలు తీసుకున్నారు. అగ్రిగోల్డ్ నుంచి ఏపీ లోని బాధితులకు రావాల్సిన మొత్తం 3,966 కోట్లపై నిర్ణయం తీసుకున్నారు.

అటాచ్ చేసిన ఆస్తులను 2016 డిసెంబరు 27 న సీఐడీ అధికారులు వేలం వేశారు. ఈ సంస్థపై సీబీఐ విచారణ జరపాలని నాటి విపక్ష నేత వై ఎస్ జగన్ ప్రధానికి లేఖ రాశారు. పాదయాత్రలో బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ 10  వేల లోపు ఉన్న 3,69, 655మంది డిపాజిటర్లకు 2019 నవంబరులో రూ. 263.99 కోట్లు చెల్లించారు. 2020 మార్చి 31 కల్లా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రెండో విడతగా 20 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెక్కుల పంపిణీకి జగన్ సర్కార్ సిధ్దపడింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ తో  బాటు డైరెక్టర్లు ఏలూరు జైల్లో శిక్ష అనుభవించారు.  ఈ ఏడాది మార్చి 4 న ఈడీ రంగప్రవేశం చేసింది. చైర్మన్ ఇంట్లో సోదాలు జరిపింది. ఈ ఏడాది డిసెంబరు 23 న మనీ లాండరింగ్ అభియోగాలపై ముగ్గురు కీలక నిందితులు అవ్వా వెంకట రామారావు, అవ్వా వెంకట శేషు నారాయణరావు,  హేమసుందర ప్రసాద్ ను ఈడీ అరెస్టు చేసింది.

కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా