ఏనుగు హంతకులను పట్టిస్తే భారీ బహుమతి..హైదరాబాద్ వాసి ఆఫర్

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో కేవలం మనుషులను నమ్మినందుకు ఓ నోరులేని మూగజీవి తన కడపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయిన హృదయ విదారకమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. హంతకులను నరహత్య నేరం కింద శిక్షించాలని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే

ఏనుగు హంతకులను పట్టిస్తే భారీ బహుమతి..హైదరాబాద్ వాసి ఆఫర్
Follow us

|

Updated on: Jun 04, 2020 | 6:07 PM

మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన..గర్భంతో ఉన్న ఏనుగును చంపేసిన ఆకతాయిలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో కేవలం మనుషులను నమ్మినందుకు ఓ నోరులేని మూగజీవి తన కడపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయిన హృదయ విదారకమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. హంతకులను నరహత్య నేరం కింద శిక్షించాలని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న కేరళ పోలీసులు నిందితుల వేటలో ముమ్మరంగా కృషిచేస్తున్నారు. ఇదిలా ఉంటే, నిందితుల ఆచూకీ చెప్పిన వారికి భారీ ఆఫర్ ప్రకటించారు ఓ హైదరాబాద్ వాసి.. వారిని పట్టిస్తే రూ. 2 లక్షల నగదు రివార్డు ఇస్తానని నేరేడ్‌మెట్ కు చెందిన శ్రీనివాస్ వ్యక్తి ప్రకటన చేశారు. దేవి నగర్‌లో నివసించే ఆయన .. ఏనుగు వధపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంతుప్రేమికుడైన శ్రీనివాస్ లాక్‌డౌన్ సమయంలో ఆహారం లేక అలమటిస్తున్న వీధి కుక్కలకు, ఆవులకు తిండి పెట్టారు. తన సొంత గ్యారేజ్‌లో ఆహారం వండించి నగర వ్యాప్తంగా పంపిణీ చేశారు. మూగజీవులకు ఇలా ప్రేమతో ఆహారం పెడుతుంటే కేరళలో ఓ పండులో పటాసులు పెట్టి అమాయక జీవిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆయన వాపోయారు.