ఒక్కరోజులోనే రూ.11 లక్షల కోట్లకు పైగా మాయం.. చరిత్రలో ఇదే తొలిసారి..

చరిత్రలో ఇంత దారుణంగా ట్రేడింగ్ ఎప్పుడూ జరగలేదట. ఓ విధంగా చెప్పాలంటే స్టాక్‌మార్కెట్లకు ఈ గురువారం బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేనంతగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. ఓ వైపు కరోనా ఎఫెక్ట్ చూపిస్తే.. మరోవైపు బేర్ దెబ్బకూడా దేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. యూరప్ దేశాలకు వెళ్లొద్దంటూ ట్రంప్ ప్రకటించడంతో.. ఒక్కసారిగా యూఎస్ యూరప్ స్టాక్ మార్కెట్లు కూదేలయ్యాయి. దీని ప్రభావం మనదేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లంతా అమ్మకాలకు దిగారు. […]

ఒక్కరోజులోనే రూ.11 లక్షల కోట్లకు పైగా మాయం.. చరిత్రలో ఇదే తొలిసారి..
Follow us

| Edited By:

Updated on: Mar 12, 2020 | 5:40 PM

చరిత్రలో ఇంత దారుణంగా ట్రేడింగ్ ఎప్పుడూ జరగలేదట. ఓ విధంగా చెప్పాలంటే స్టాక్‌మార్కెట్లకు ఈ గురువారం బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేనంతగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. ఓ వైపు కరోనా ఎఫెక్ట్ చూపిస్తే.. మరోవైపు బేర్ దెబ్బకూడా దేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. యూరప్ దేశాలకు వెళ్లొద్దంటూ ట్రంప్ ప్రకటించడంతో.. ఒక్కసారిగా యూఎస్ యూరప్ స్టాక్ మార్కెట్లు కూదేలయ్యాయి. దీని ప్రభావం మనదేశీ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో ఇన్వెస్టర్లంతా అమ్మకాలకు దిగారు. దీంతో గురువారం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా షేర్లన్నీ పడిపోయాయి. గురవారం ఒకే రోజులో ఇన్వెస్టర్లు రూ.11 లక్షల కోట్లకు పైగా పోగొట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పడిపోవడం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 3,200 పాయింట్లకు పైగా కుప్పకూలిపోయి.. 32,493 స్థాయికి దిగొచ్చింది. అటు నిఫ్టీ కూడా 950 పాయింట్లు క్షీణించి.. 9,508 స్థాయికి వచ్చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,919 పాయింట్లు నష్ట పోయి 32,778 వద్ద, నిఫ్టీ 868 పాయింట్లు నష్టపోయి 9,590 వద్ద ముగిశాయి.

మొత్తం 783 కంపెనీలు 52వారాల కనిష్ట స్థాయిలో ట్రేడ్ అయ్యాయి. వీటిలో రిలయన్స్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌పీసీఎల్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, స్పైస్‌జెట్‌, ఏబీబీ, హీరో మోటో, ఏసీసీ, బీఈఎంఎల్‌,గెయిల్‌,గిల్లెట్‌, గ్లెన్‌మార్క్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఉన్నాయి.