Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 68 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 968876. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 331146. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 612815. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24915. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • వైద్య, ఆరోగ్యశాఖలో వివిధ కార్యక్రమాల అమలుకు నిధుల విడుదల. 330 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ. కేసీఆర్ కిట్ల పథకం కోసం 110.75 కోట్లు విడుదల.
  • కర్నూలు టీవీ9 ఎఫెక్ట్: వర్షపు నీరు వచ్చిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనీ కోవిడ్ వార్డును తనిఖీ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. ఇంకోసారి ఇ వర్షపు నీరు రాకుండా చూస్తావని వార్డు లోని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ.
  • ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రులు. తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ఈ రోజు ప్రారంభమైంది. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి కే తారకరామారావు సమక్షంలో ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ లాంచ్ చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి హరీష్ రావు ఇన్వెస్ట్ తెలంగాణ వెబ్సైట్ ప్రారంభించారు. https://invest.telangana.gov.in/ లింక్ ద్వారా వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
  • విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ . విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మంత్రి సబిత, అధికారులతో సీఎం సమావేశం. విద్యాసంవత్సరం, పరీక్షలు, ఇతర అంశాలపై చర్చ.
  • కరోనా పేషంట్ల ను రక్షించడానికి సిద్ధమైన కరోనా విజేతలు . తెలంగాణలో ఏర్పాటైన ప్లాస్మా డోనార్స్ ఆసోషియేషన్ . తెలంగాణ ప్లాస్మా డోనార్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ. కోవిడ్ నుండి బయటపడినవాళ్ళు ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి. ప్లాస్మా తెరఫి కి సంబంధించి ఒక అధికారిని కేటాయించాలి . ఫ్లాస్మా దాతలకు రాష్ట్రంలో విధి విధానాలు రూపొందించాలంటూ విజ్ఞప్తి.
  • అమరావతి: అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి. విచారణ ను వాయిదా వేసిన ధర్మాసనం. ESI స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు. కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు.
  • ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం. ట్రేడింగ్ లో పెట్టుబడులు అంటూ వ్యాపారవేత్తను దగ్గర నుంచి కొట్టేసిన ముఠా . ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

‘ఆర్ఆర్ఆర్’ టైటిల్.. క్లారిటీ ఎప్పుడు వస్తుందో!

పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్.. ఇప్పటి వరకూ 80 శాతం పూర్తైందని సమాచారం. అయినా ఇప్పటికే దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని..
RRR Title is Rama Ravana Rajyam?, ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్.. క్లారిటీ ఎప్పుడు వస్తుందో!

RRR Movie News: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత.. మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి దర్శకధీరుడు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్, చెర్రీలు నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొదటిసారిగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచీ భారీ అంచనాలే నెలకొన్నాయి.

పాన్ ఇండియాగా తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్.. ఇప్పటి వరకూ 80 శాతం పూర్తైందని సమాచారం. అయినా ఇప్పటికీ దీని టైటిల్ ఏమిటన్న విషయంపై స్పష్టత లేదు. వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’కు మంచి టైటిల్‌ను ప్రేక్షకులు సూచించాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాటిల్లో కొన్ని టైటిల్స్‌కు మంచి స్పందన వచ్చింది. అవి ‘రామ రావణ రాజ్యం’, ‘రఘుపతి రాఘవ రాజారామ్’. ఈ రెండింటిలో.. ‘రామ రావణ రాజ్యం’ టైటిల్‌కి అధిక స్పందన వచ్చిందట. ఇక హిందీలో ఈ సినిమాకు ‘రామ్ రావణ్ రాజ్’ అన్న పేరు పెట్టాలని డైరెక్టర్ రాజమౌళి అనుకుంటున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇక ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ ఇదేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సి ఉంటుంది.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

లాయర్ తల పగిలింది.. మేము ప్రాణాలతో.. వస్తామో.. రామో..

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

Related Tags