‘ఆర్‌ఆర్ఆర్’ ఉగాది కానుక.. ఇంట్రస్టింగ్ పోస్టర్..కోపం ఎవరిది.. శాంతం ఎవరిది..!

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

'ఆర్‌ఆర్ఆర్' ఉగాది కానుక.. ఇంట్రస్టింగ్ పోస్టర్..కోపం ఎవరిది.. శాంతం ఎవరిది..!
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2020 | 9:02 PM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌తో పాటు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా తెలుగు సంవత్సరాది ఉగాది కానుకగా ఈ మూవీ నుంచి టైటిల్ లోగో, మోషన్‌ పోస్టర్‌ను విడుదలను చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర యూనిట్ ఇచ్చేసింది. ఈ మేరకు టీమ్ ఓ పోస్టర్ విడుదల చేయగా.. అందులో ఒకరి చెయ్యి మంటలతో ఆవేశంగా ఉండగా.. మరో చెయ్యి నీళ్లతో శాంతంగా ఉంది. చూస్తుంటే ఇద్దరి హీరోల పాత్రలు ఇలానే ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. మరి ఎవరు ఆవేశంతో ఉంటారు..? ఎవరు శాంతంతో ఉంటారు..? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈ సందర్భంగా ఓ పోస్ట్ చేసిన రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఇబ్బందిలో ఉంది. ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తోన్న ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను రేపు విడుదల చేస్తున్నాం. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేస్తున్నారు. అందుకే ఎప్పుడు విడుదల చేస్తామన్న సమయం కచ్చితంగా చెప్పలేము. అందరూ ఎవరి ఇంట్లో వారు ఉండి ఎంజాయ్ చేయాలని మా టీమ్‌ అందరం కోరుకుంటున్నాం. ఒక కారణంతో దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయిపోయింది. అందుకే సోషల్ గ్యాథరింగ్ లేకుండా చూసుకోండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. వారి సరసన ఒలివియా, అలియా భట్ కనిపించనున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కీరవాణి సంగీతం అందిస్తోన్న ఈ మూవీ తెలుగులో పాటు మరికొన్ని భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది.

Read This Story Also: పవన్ ప్రామిస్.. దిల్ రాజు హ్యాపీ..!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..