RRR : “లుక్ టెస్ట్ కోసం పిలిచి, పాత్ర ఇచ్చేశారు”

టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రియా కూడా ఒకరు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా ఆమె ఆడిపాడారు.

RRR : లుక్ టెస్ట్ కోసం పిలిచి, పాత్ర ఇచ్చేశారు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 4:43 PM

టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రియా కూడా ఒకరు. టాలీవుడ్ అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోలతో కూడా ఆమె ఆడిపాడారు. ఇప్పటికీ సీనియర్ హీరోలకు ఆమె మెయిన్ ఆప్షన్ గా ఉన్నారు. ఈ నటి ప్రస్తుతం తన భర్తతో కలిసి బార్సిలోనాలో నివసిస్తోంది. త్వరలో టాలీవుడ్ లో తిరిగి వర్క్ ప్రారంభించడానికి హైదరాబాద్ రావడానికి రెడీగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆర్ఆర్ఆర్ చిత్రంలో శ్రియా కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత శ్రియ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తోంది. గతంలో ఆమె  జక్కన్న తీసిన ఛత్రపతి మూవీలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆమె ఎంపిక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం తన కజిన్ వివాహం కోసం శ్రియా ఇండియా వచ్చారు. ఆ సమయంలో, ఆమెను లుక్ టెస్ట్ కోసం ఆర్ఆర్ఆర్ మేకర్స్ పిలిచారు. లుక్ టెస్ట్ ఇవ్వడానికి శ్రియా టీమ్ ను కలుసుకున్న సమమంలో, ఆమెకు పాత్ర కన్పామ్ అయినట్లు చెప్పారు. శ్రియ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొదట శ్రియ ఈ చిత్రంలో భాగం కావాలని ఆశించలేదట. కాని కొన్ని సన్నివేశాల కోసం షూట్‌లో పాల్గొంది. మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అజయ్ దేవగన్ సరసన శ్రియ కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. కాగా ఇప్పటిదాకా రాజమౌళి తన సినిమాలలో హీరోయిన్స్ పరంగా అనుష్కను తప్ప వేరెవ్వరిని రిపీట్ చేయలేదు.. ఇప్పుడు శ్రియను రిపీట్ చేస్తుండటం విశేషం.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం

ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు